‘శ్రీవల్లి’ పాటలో అల్లు అర్జున్ వాకింగ్ స్టైల్ స్పెషల్..అదెలా వచ్చిందంటే?

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రం ఘన విజయం సాధించింది. పాన్ ఇండియా వైడ్ గా సినీ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నది ఈ పిక్చర్. సెకండ్ పార్ట్ కోసం సినీ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో ‘పుష్ప’ రాజ్ గా బన్నీ యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ లో ఉండగా, డైరెక్టర్ సుకుమార్ టేకింగ్ కు జనాలు ఫిదా అయ్యారు.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్-స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ఫిల్మ్ ఇది. కాగా, ఇందులో డైలాగ్స్, మేనరిజమ్స్ ప్రజలకు తెగ నచ్చాయి. సాధారణ జనాలతో పాటు సెలబ్రిటీలు బన్నీ మేనరిజమ్స్ కాపీ కొడుతూ వీడియోలు చేశారు. ఇప్పటికీ ఆ మేనియా కొనసా..గుతోంది. క్రికెటర్స్, సినిమా స్టార్స్ తో పాటు పొలిటీషియన్స్ కూడా ‘పుష్ప’ డైలాగ్స్ కొడుతున్నారు.

 

ఇక ఈ పిక్చర్ లోని ‘శ్రీవల్లి’ పాటలో అల్లు అర్జున్ వాకింగ్ స్టైల్ జనాలకు విపరీతంగా నచ్చింది. ఒంటి కాలుతో గాగుల్స్ ధరించి అలా నడుస్తుండటం చూసి వావ్ అనుకున్నారు ప్రేక్షకులు. బన్నీ వాకింగ్ స్టైల్ స్పెషల్ గా నిలిచిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ వాకింగ్ స్టైల్ ఎలా వచ్చిందో బయటపెట్టారు హీరో అల్లు అర్జున్.

‘శ్రీవల్లి’ సాంగ్ చేస్తున్నపుడు దర్శకుడు సుకుమార్…స్టెప్ డిఫరెంట్ గా ఉండాలని చెప్పారట. దాంతో పాటు ఈ స్టెప్ ను ప్రతీ ఒక్కరు అనుకరించేలాగా ఈజీగా, స్టైల్ గా, డిఫరెంట్ ప్లస్ యూనిక్ గా ఉండాలని అన్నారట. దాంతో తానే సొంతంగా ఈ విధంగా నడిచానని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. అలా సరికొత్త వాకింగ్ స్టైల్ ను కనిపెట్టి బన్నీ..తన పాపులారిటీని ఇంకా పెంచుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news