Sudeep: హిందీ జాతీయ భాష కాదు..పాన్ ఇండియా ఫిల్మ్స్‌పై సుదీప్ కామెంట్స్ ఇవే..

-

కన్నడ చిత్ర సీమకు చెందిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన KGF2 సినిమాకు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. ఈ పిక్చర్ ను సినీ ప్రమఖులు ప్రతీ ఒక్కరు దాదాపుగా అభినందిస్తున్నారు. ప్రశాంత్ నీల్ టేకింగ్, యశ్ నటన పట్ల ప్రశంసల వర్షం కురిపిస్తు్న్నారు. తాజాగా ఈ చిత్ర విజయంపై శాండల్ వుడ్ స్టార్ హీరో సుదీప్ మాట్లాడారు. KGF2 మూవీ యూనిట్ సభ్యులను అభినందించారు.

ఈ క్రమంలోనే సుదీప్ మాట్లాడుతూ బాలీవుడ్ గురించి, పాన్ ఇండియా ఫిల్మ్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలు కన్నడ భాషలోనూ తెరకెక్కుతున్నాయని, ఈ క్రమంతోనే తాను ఓ విషయం చెప్పాలనుకుంటున్నానని అన్నాడు. అదేంటంటే.. హిందీ అనేది ఇకపై జాతీయ భాష కాదని, బాలీవుడ్ వాళ్లు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారని, తెలుగు, తమిళ్ భాషల్లో డబ్ అవుతున్న వారి పిక్చర్స్ సక్సెస్ కావడం లేదని పేర్కొన్న సుదీప్..కన్నడ భాషలో తెరకెక్కిన చిత్రాలు అన్ని భాషల్లో ఆదరించబడుతున్నాయని వివరించారు.

సుదీప్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. హిందీ భాషా ఆధిపత్యంను ప్రశ్నించిన మాదిరిగా పరోక్షంగా సుదీప్ వ్యాఖ్యలున్నాయని ఈ సందర్భంగా కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇంగ్లిష్ భాషకు ప్రత్యామ్నాయంగా హిందీ భాషను మాట్లాడాలని గతంలో కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. కాగా, ఇక హిందీ జాతీయ భాష కాదని తాజాగా సుదీప్ మాట్లాడారు. సుదీప్ నటించిన తాజా చిత్రం ‘విక్రాంత్ రోనా’ ఈ ఏడాది జూలై 28న విడుదల కానుంది. కన్నడ, తెలుగు, తమిళ్ తో పాటు హిందీ భాషలోనూ ఈ పిక్చర్ రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news