సమంతను తక్కువ అంచనా వేసిన సుకుమార్..!

-

అక్కినేని కోడలు.. సౌత్ క్రేజీ హీరోయిన్ సమంత పెళ్లి తర్వాత కూడా తన ఫాం కొనసాగిస్తుంది. రంగస్థలం, యూటర్న్, మజిలీ ఇలా ఆఫ్టర్ మ్యారేజ్ సమంత మరింత క్రేజ్ తెచ్చుకుందని చెప్పొచ్చు. వరుస హిట్లతో దూసుకెళ్తున్న సమంత సెలెక్టెడ్ సినిమాలను చేస్తుంది. ఇదిలాఉంటే రాం చరణ్ రంగస్థలంలో హీరోయిన్ గా ముందు సమంతను అనుకోలేదట దర్శకుడు సుకుమార్.

రామలక్ష్మి పాత్రలో ఎవరు బాగుంటారని చూస్తుంటే సమంత పేరు నిర్మాతలు సజెస్ట్ చేశారట. అయితే పెళ్లి తర్వాత హీరోయిన్స్ కు అంత క్రేజ్ ఉండదని ఆమెను వద్దన్నాడట. అంతేకాదు ఇద్దరు స్టార్స్ ను తను హ్యాండిల్ చేయడం కష్టమని భావించాడట. అయితే ఫైనల్ గా సమంత హీరోయిన్ గా ఫిక్స్ అయ్యి.. తను సీన్ చేస్తున్న ప్రతిసారి తనని ఫట్ ఫట్ మని కొట్టినట్టు అనిపించిందని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు సుకుమార్. మొత్తానికి సుకుమార్ సమంత విషయంలో పొరపాటే పడ్డాడని అర్ధమైంది. కుదిరితే సమంతతో ఇంకా సినిమాలు చేస్తూనే ఉంటా అంటున్నాడు సుకుమార్.

Read more RELATED
Recommended to you

Latest news