మోడ్రన్ డ్రెస్సులో అందాలతో మత్తెక్కిస్తూ..ఇంటి విషయాలు బయటపెట్టిన తమన్నా!

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ తమన్నా భాటియా..తన అందాలతో నెట్టింట హల్ చల్ చేస్తుంటుంది. తాజాగా ఈ మిల్కీ బ్యూటీ ఓ షో కోసం ముస్తాబైన ఫొటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా, అవి నెట్టింట బాగా వైరలవుతున్నాయి. ఈ ఫొటోల్లో మోడ్రన్ డ్రెస్సులో తమన్నా భాటియా ..నెటిజన్లకు మత్తెక్కిస్తున్నది.

జీన్స్ ధరించి నడుమందాలతో పాటు క్లీవేజ్ షో చేస్తూ తమన్నా..పిచ్చెక్కిస్తోంది. స్విగ్గీ వారి ‘ఇన్ సైడ్ మై కిచెన్’ అనే షో కోసం..తమన్నా భాటియా ఇలా ముస్తాబైంది. ఈ షోలో తమన్నా..తన ఇంటి విషయాలు అనగా..కిచెన్ సీక్రెట్స్ అన్నీ బయటపెట్టేసింది.

ఈ సందర్భంగా దిగిన ఫొటోలు షేర్ చేసింది. అవి చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. గ్లామర్ ఒలకబోయడంలో తమన్నకు సాటి ఎవరు లేరని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఇటీవల F3 సినిమాలో ఫన్నీ రోల్ ప్లే చేసి ప్రేక్షకుల మెప్పు పొందిన తమన్నా భాటియా ప్రస్తుతం..మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాతో పాటు యంగ్ హీరో సత్యదేవ్ ‘గుర్తుందా కాలం’ పిక్చర్ లో నటిస్తోంది.