RRR: రామ్ చరణ్ బాటలో జూనియర్ ఎన్టీఆర్..సేమ్ టు సేమ్!

-

టాలీవుడ్ క్రేజీ అండ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన RRR సినిమా ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తోంది ఈ చిత్రం. ఇందులో ఇద్దరు సూపర్ స్టార్స్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. ఈ చిత్ర విజయంతో వీరిరువురు పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారని చెప్పొచ్చు.

ఇకపోతే వెండితెరపైనే కాదు రియల్ లైఫ్ లోనూ వీరు క్లోజ్ ఫ్రెండ్స్. ఈ నేపథ్యంలోనే సినిమాలో వీరి బ్రదర్ హుడ్ బాగా వర్కవుట్ అయింది. కాగా, రామ్ చరణ్ బాటలో జూనియర్ ఎన్టీఆర్ నడుస్తున్నారు. ఏ విషయంలోనంటే..రామ్ చరణ్ ఇటీవల అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా, శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకున్నారు.

అలా మొత్తంగా RRR హీరోలు సినిమా ఘన విజయం సాధించిన తర్వాత దీక్షలు చేపట్టారు. రామ్ చరణ్ తన తండ్రితో కలిసి నటించిన ‘ఆచార్య’ పిక్చర్ ఈ నెల 29న విడుదల కానుంది. ఓ వైపు ఆచార్య ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంటూనే మరో వైపు RC 15 ఫిల్మ్ షూటింగ్ లోనూ రామ్ చరణ్ పాల్గొంటున్నారు. తారక్ తన నెక్స్ట్ ఫిల్మ్ NTR30 కోసం ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version