తెలుగు ఫిల్మ్ ఫెస్టివల్..త్వరలో పెద్ద సినిమాల పండుగ

కొవిడ్ మహమ్మారి వలన ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీ బాగా నష్టపోయింది. థియేటర్స్ చాలా కాలం మూసివేయబడి ఉన్నాయి. ఇక సినిమాల షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దాంతో ప్రాజెక్టులన్నీ ఆలస్యమవుతూ వచ్చాయి. కాగా, పరిస్థితులు చక్కబడిన నేపథ్యంలో ఒక్కొక్కటిగా సినిమాలు విడుదలై సక్సెస్ అవుతున్నాయి. అయితే, ఈ ఏడాది సంక్రాంతి కానుకగా పెద్ద సినిమాలు విడుదల కావాల్సింది. కానీ, కరోనా వలన విడుదల కాలేదు.

ఏటా సంక్రాంతి సందర్భంగా పెద్ద సినిమాల పండుగ ఉండేది. కానీ, ఈ సారి అలా లేదు. కాగా, వచ్చే ఏడాది మాత్రం మొత్తం పెద్ద సినిమాలే సందడి చేయనున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సంస్థ నుంచి పెద్ద సినిమాల విడుదల ఉంటుందని సమాచారం.

ఇండియన్ జీనియస్ ప్రొడ్యూసర్ శంకర్ – రామ్ చరణ్ కాంబో మూవీ RC15, వంశీ పైడిపల్లి – తలపతి విజయ్ ‘తలపతి 66’..సంక్రాంతి బరిలోనే ఉంటాయని తెలుస్తోంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఆది పురుష్’, సూపర్ స్టార్ మహేశ్ – త్రివిక్రమ్ ‘SSMB28’, మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘ఖుషి’..ఇలా పెద్ద సినిమాలన్నీ సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని రూపొందుతున్నాయి.

చూడాలి మరి.. ఇందులో ఎన్ని చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచి విజయం సాధిస్తాయో..