తలపతి66 అప్‌డేట్ వచ్చేసింది..విజయ్ సినిమా టైటిల్ ఇదే..

-

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్-టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘తలపతి 66’. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండగా, హీరోయిన్ గా క్యూట్ బ్యూటీ రష్మిక మందన నటిస్తోంది. ‘మహర్షి’ వంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఇది కావడం విశేషం.

ఈ చిత్రంలో భారీ తారాగణమే ఉంది. శ్రీకాంత్, సంగీత, శ్యామ్, ప్రకాశ్ రాజ్ , జయసుధ, యోగి బాబు, ప్రభుతో పాటు చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. ఈ సినిమాలో విజయ్ వెరీ క్లాసీ లుక్ లో ఫ్యామిలీ తో బాండేజ్ కలిగి ఉంటాడని తెలుస్తోంది. జూన్ 22న విజయ్ బర్త్ డే కాగా, బర్త్ డే కంటే ముందే మేకర్స్ సినిమా అప్ డేట్ సర్ ప్రైజ్ గా ఇచ్చేశారు.

విజయ్ అభిమానుల కోసం మేకర్స్ తాజాగా సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. సదరు పోస్టర్ లో విజయ్ సూట్ లో క్లాసీ లుక్ లో అదరగొట్టేశారు. ‘వారసి’ అనే టైటిల్ తో తమిళ్ లో ‘వారసుడు’ అనే టైటిల్ తో తెలుగులో ఈ చిత్రం విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news