ఇండియన్ సినిమాల్లో సిరీస్, ఫ్రాంఛైజీలు ట్రెండ్ గా మారాయి అని చెప్పవచ్చు.. ఇదే నేపథ్యంలో వచ్చిన హిట్ ఫ్రాంఛైజీ కూడా ట్రెండ్ సెట్ చేసింది… మొదటి సినిమా హిట్ కావడం, `హిట్2` స్కేల్ పెంచడం, అడివి శేష్ నటించడం, దీన్ని ఏడు సిరీస్‌లుగా తీసుకురాబోతున్నారనే అంశాలు మరింత హైప్ తీసుకొచ్చాయి. అయితే హిట్టు 2 క్లైమాక్స్ లో హిట్ 3 కోసం లేటెస్ట్ అప్డేట్ ఇచ్చేశారు..
`హిట్2` క్లైమాక్స్ లోనే `హిట్ 3 ది థర్డ్ కేసు` గురించి చెప్పేశారు.. మూడో భాగంలో హీరోగా నానిని ప్రకటించారు. ఎండింగ్లో ఆ విషయాన్ని చూపించే సన్నివేశాలు, హీరో ఇంట్రడక్షన్ ఓ రేంజ్లో ఇచ్చారు. దీంతో థియేటర్లు హోరెత్తిపోయాయి. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ నానిని హీరోగా చూపించిన తర్వాతే అసలు సమస్య స్టార్ట్ మొదలైంది. నాని థ్రిల్లర్ చిత్రాలకు ఆయన సెట్ కాడనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. `హిట్ 3′ సినిమాకి హీరోగా నాని సెట్ కాడని, ఇక `హిట్`ని ఆ దేవుడే కాపాడాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అదే విషయాన్ని వెల్లడిస్తూ నానిని ట్రోల్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అలాగే ‘హిట్`తో పోల్చితే `హిట్2` ఆశించిన స్థాయిలో లేదనే టాక్ ఉంది. `హిట్3`తో ఆ క్రేజ్ మరింత పడిపోతుందని, ఇక ఈ సిరీస్ క్లోజ్ అయినా ఆశ్చర్యం లేదంటున్నారు. అదే సిరీస్ గా వస్తున్న వీటిల్లో ఏ ఒక్క సినిమా సరిగా ఆడకపోయినా పక్కన పెట్టేస్తారు అభిమానులు.. అయితే ఏది ఏమైనా ఈ చిత్రం ఇప్పుడు తీవ్రస్థాయిలో ట్రోల్స్ విమర్శలు ఎదుర్కోవటం చిత్ర బృందానికి కొంత బాధ కరమైన విషయమైనా చెప్పాలి అయితే విడుదలైన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి మరి.. ఇందులో మలుపులతో ప్రేక్షకులను ఏమాత్రం అలరిస్తారో ప్రస్తుతం అయితే ప్రశ్నఆర్థకంగానే మారింది..