మగజాతి మొత్తం అంతరించిపోయి స్త్రీ జాతికి నేనొక్కడినే దిక్కవ్వాలి.. రాంగోపాల్ వర్మ

-

టాలీవుడ్ లో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరొకసారి వైరల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు తాజాగా నాగార్జున యూనివర్సిటీ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వర్మ విద్యార్థులతో మాట్లాడుతూ కాంట్రవర్సీకి తెర తీశారు. వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేస్తూ వైరల్ గా మారారు.

తాజాగా నాగార్జున యూనివర్సిటీ లో జరిగిన ఓ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దర్శకుడు రాంగోపాల్ వర్మ విద్యార్థులకు ఉచిత సలహాలు ఇచ్చారు. ఏం చేయాలన్నా ఈ వయసులోనే చేయాలి అందుకే నచ్చింది తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి అంటూ చెప్పుకొచ్చారు.. ఉన్నది ఒకటే జీవితం దాన్ని పాడు చేసుకోవద్దు.. చనిపోయాక స్వర్గానికి వెళ్తే రంభ, ఊర్వశి, మేనకలు ఉండకపోవచ్చు కాబట్టి ఇక్కడే ఎంజాయ్ చేయండి అంటూ విద్యార్థులకు హితబోధ చేశారు. ఎవరికి నచ్చిన విధంగా వారు బతకాలని ఎవరి మాట వినాల్సిన అవసరం లేదని అన్నారు. కష్టపడి చదివే వారు ఎప్పుడూ పైకి రాలేరని అందుకే జీవితాన్ని ఎంజాయ్ చేయండి అని అన్నారు.

 

ఇంకా మాట్లాడుతూ భయంకరమైన వైరస్ వచ్చి మగజాతి అంతా అంతరించిపోవాలని నేను మాత్రమే ఉండిపోయి స్త్రీ జాతికి దిక్కవ్వాలంటూ చెప్పుకొచ్చారు. కాగా ఈ మాటలకు అక్కడ వారెవరు అడ్డు చెప్పకపోగా రాంగోపాల్ వర్మ ఒక ప్రొఫెసర్, ఫిలాసఫర్ అంటూ ప్రశంసించడం మరో విశేషం. అంతేకాకుండా వర్మకు పిహెచ్ డి, ఆస్కార్ కంటే ఎక్కువ అర్హతలు ఉన్నాయని చెప్పటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.. ప్రస్తుతం ఈ మాటలు విన్న వారంతా వర్మపై విరుచుకుపడుతున్నారు విద్యార్థులకు చెప్పాల్సిన మాటలు ఇవేనా.. ఇలాంటి మాటలు వారికి చెప్తే వారి భవిష్యత్తు ఏమవుతుంది అంటూ మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news