బాలాదిత్యతో ఆ హీరోయిన్ వివాహం ఆగిపోవడానికి కారణం..?

-

బాలాదిత్య గురించి చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఇటీవల బిగ్ బాస్ సీజన్ సిక్స్ ద్వారా కంటెస్టెంట్ గా రావడంతో ఈయన మళ్ళీ అందరికీ దగ్గరయ్యాడు. నటుడు బాలాదిత్య యాంకర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా, హీరోగా, బాల నటుడిగా ఇలా ఎన్నో రకాలుగా రాణించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా 40 సినిమాలలో నటించిన బాలాదిత్య, హీరోగా 10 సినిమాల వరకు చేశారు . ఈయన నటించిన లిటిల్ సోల్జర్స్ అనే సినిమాకి నంది అవార్డు కూడా లభించింది. అలాగే చంటిగాడు, సుందరానికి తొందరెక్కువ, 1942లో ఓ గ్రామం, మా ఊరి పొలిమేర వంటి సినిమాలలో హీరోగా నటించారు.

ఇకపోతే అలాంటి బాలాదిత్య కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. కానీ తాజాగా బిగ్ బాస్ ఆరవ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని అందరికీ దగ్గరయ్యాడు. ఇదిలా ఉండగా బాలాదిత్య నటి సుహాసిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. మరి ఇంతకీ ఇందులో అసలు విషయం ఏమిటో బాలాదిత్య మాటల్లోనే తెలుసుకుందాం. హీరోయిన్ సుహాసినికి హీరోయిన్ గా అవకాశాలు తగ్గినప్పుడు.. బుల్లితెర మీద కూడా కొన్ని సీరియల్స్ లో నటిస్తోంది. ఇప్పటికీ కూడా బుల్లితెర సీరియల్స్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈమె అదే సీరియల్స్ కు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఉండడం గమనార్హం.

ఇదిలా ఉండగా బాలాదిత్యాతో ఈమెకు ఉన్న సన్నిహిత్యం వల్ల వీరిద్దరి మధ్య ఏదో ఎఫైర్ ఉందని వార్తలు బాగా వినిపించాయి. అంతే కాదు వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారని కొన్ని రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం జరిగింది. అయితే ఈ విషయంపై ఆ టైంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో వీరిద్దరి మధ్య నిజంగానే ఏదో నడుస్తోందని చాలామంది భావించారు. అయితే ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొన్న బాలాదిత్య తనపై వచ్చిన వార్తల గురించి క్లారిటీ ఇచ్చారు. నాకు సుహాసినికి మధ్య ఎలాంటి అఫైర్ లేదు.. అసలు మేము పెళ్లి చేసుకోవాలనుకోలేదు. మంచి స్నేహితులం మాత్రమే.రెండు సినిమాలలో కలిసి నటించేసరికి మా మధ్య స్నేహం బాగా పెరిగిపోయింది. కానీ మాపై వచ్చిన వార్తల్లో ఎటువంటి నిజం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news