దేశ సేవ కోసం 21 ఏళ్లకే కదిలిన ఆ స్టార్ విలన్ కూతురు..!

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ సినిమాలలో రేసుగుర్రం సినిమా కూడా ఒకటి. ఇందులో హీరోగా అల్లు అర్జున్ ఎంత పాపులారిటీ దక్కించుకున్నారో .. విలన్ పాత్రకి కూడా అంతే మంచి పేరు లభించింది. మద్దాలి శివారెడ్డి గా భోజ్ పురి నటుడు రవి కిషన్ తన నటనతో అదరకొట్టేసాడని చెప్పాలి. ముఖ్యంగా భోజ్ పురి తో పాటు హిందీలో కూడా పలు సినిమాలలో నటించే ఈయన రేసుగుర్రం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఇక ఈ సినిమా తర్వాత కిక్ 2, సుప్రీం, అబద్దం, రాధా, ఎమ్మెల్యే , ఎన్టీఆర్ కథానాయకుడు, సాక్ష్యం, సైరా నరసింహారెడ్డి, 90 ఎం.ఎల్ , హీరో వంటి చిత్రాలలో విలన్ తోపాటు స్పెషల్ రోల్స్ లో కూడా సందడి చేసిన రవికిషన్ కేవలం సినిమాలలోనే కాదు రాజకీయాలలో కూడా తన ప్రతిభను చాటుకుంటున్నారు.

ఇకపోతే 2019 బిజెపి తరఫున గోరఖ్ పూర్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టారు. ఇదిలా ఉండగా ప్రీతిశుక్లాను వివాహం చేసుకున్న ఈయనకు ఒక కుమారుడు, ముగ్గురు కూతుర్లు కాగా అందులో ఒక కూతురు ఇషితా తాజాగా సైన్యంలో చేరింది. ప్రతిష్టాత్మక అగ్నిపథ్ స్కీమ్ ను తాజాగా కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ పథకం ద్వారా ఇషితా ఆర్మీలో చేరింది. ఈ విషయాన్ని రవి కిషన్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఇషితా వయసు కేవలం 21 సంవత్సరాలేనట.

 

ఈ క్రమంలోనే అతి చిన్న వయసులోనే సరిహద్దుల్లో దేశ సేవ కోసం ఆమె తీసుకున్న నిర్ణయం పై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో కూతురిని దేశ సేవ కోసం ప్రోత్సహించిన రవి కిషన్ ని కూడా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు నెటిజన్స్.

Read more RELATED
Recommended to you

Exit mobile version