పుష్ప ఐటమ్ సాంగ్ మొదటి ఎంపిక సమంత కాదా..?

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో.. మైత్రి మూవీ మేకర్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా 2021 డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలయ్యి దాదాపు ఏడాదికి పైగానే అవుతున్నా.. ఇప్పటికీ ఈ సినిమా మేనియా ఇంకా తగ్గలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇందులో అల్లు అర్జున్ మాస్ లుక్ ఆయన చెప్పే చిత్తూరు డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలోని ప్రతిపాట కూడా ప్రేక్షకులను బాగా అలరించింది.

ముఖ్యంగా ఈ సినిమాలో “ఊ అంటావా మావా” అంటూ సమంత వేసిన స్టేప్పులు ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసాయి. ఒక్క ఈ పాట ద్వారా సమంతా పాన్ ఇండియా స్థాయిలో ఎంతోమందికి చేరువయ్యింది. అంతేకాదు ఏ ఫంక్షన్ లో చూసినా.. పార్టీలకు వెళ్లినా.. తప్పనిసరిగా అక్కడ ఈ పాట మనకు వినపడుతుంది. ఈ పాటలో అల్లు అర్జున్ సమంత కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ కావడంతో ఈ పాట సెన్సేషనల్ హిట్ అయింది. అయితే ఈ పాటలో ముందుగా అనుకున్నది సమంతను కాదట.

మిల్క్ బ్యూటీ తమన్నను ఎంపిక చేసారట. వీరిద్దరి కెమిస్ట్రీ అయితే అద్భుతంగా ఉంటుందని భావించిన మేకర్స్ తమన్నాను ఎంపిక చేయడంతో అల్లు అర్జున్ మాత్రం ఆమెను రిజెక్ట్ చేసి ఆ అవకాశాన్ని సమంతకు కల్పించినట్టు తెలుస్తుంది. అయితే అప్పుడే నాగచైతన్యతో విడాకులు తీసుకున్నటువంటి సమంత ఇలా ఐటమ్ సాంగ్ లో చేయడం బాగుండదని భావించినప్పటికీ అల్లు అర్జున్ సమంతకు ఫోన్ చేసి ఈ సినిమాలో చేయడానికి ఒప్పించాలని తెలుస్తోంది. మొత్తానికైతే ఈ ఒక్క పాటతో సమంత క్రేజ్ కూడా పూర్తిస్థాయిలో మారిపోయిందని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news