చిత్ర పరిశ్రమలో విషాదం.. షూటింగ్ లొకేషన్ లొనే సీనియర్ నటుడు కన్నుమూత

చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు వీపి ఖలీద్(70) షూటింగ్ లొకేషన్లోనే కన్నుమూశారు. కేరళలోని వయక్కం సమీపంలో సినిమా షూటింగ్ లో పాల్గొన్న ఖలీద్ కు శుక్రవారం గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించారు. కగా ఆయన ప్రస్తుతం దర్శకుడు జూడ్ ఆంటోని డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సెట్స్ కు వెళ్లిన ఆయన ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం వాష్ రూమ్ కి వెళ్లి తిరిగి రాలేదు.

దీంతో అనుమానం వచ్చిన చిత్ర యూనిట్ సభ్యులు లోనికి వెళ్లి చూడగా ఖలీద్ అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే చిత్రబృందం ఆయనని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. వీపి ఖలీద్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసే వారు. తరువాత బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లో నటించడం తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆయన కుమారులు షైజు,జింసి, ఖలీధ్ రెహమాన్ ముగ్గురు కూడా ఫిలిం ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటించారు.