కరోనా మళ్లీ విజృంభిస్తున్నట్లు కనబడుతోంది. ఇటీవల కొవిడ్ కేసుల్లో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు కొవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కరోనా బారిన పడ్డారు. కొవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ప్రస్తుతం ఆయన స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తనను గత మూడు రోజులుగా కలిసిన ప్రతీ ఒక్కరు కొవిడ్ టెస్టులు చేయించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాలయ్య పేర్కొన్నారు.
బాలయ్య..ప్రజెంట్ మాస్ అండ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 107 ఫిల్మ్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ పిక్చర్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో హీరోయిన్ గా టాలెంటెడ్ శ్రుతిహాసన్ నటిస్తోంది.ఈ ఫిల్మ్ తర్వాత F3 ఫేమ్ అనిల్ రావిపూడితో తన 108వ సినిమా (NBK 108) చేయనున్నారు బాలయ్య.