ఖరీదైన కారును కొనుగోలు చేసిన త్రివిక్రమ్.. ఎన్ని కోట్లు అంటే..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలకు సంభాషణలు అందించిన ఈయన మరి ఎంతో అద్భుతంగా చిత్రాలను తెరకెక్కించి.. మరింత పాపులారిటీని దక్కించుకున్నాడు. ఇకపోతే త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక సినిమా తెరకెక్కిస్తుండగా ఈ సినిమా షూటింగు రోజురోజుకు ఆలస్యం అవుతూ ఉండడం హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా త్రివిక్రమ్ ఖరీదైన లగ్జరీ కార్ ను కొనుగోలు చేశారు. ప్రస్తుతం త్రివిక్రమ్ కొనుగోలు చేసిన ఈ కార్ ధర ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

త్రివిక్రమ్ కొనుగోలు చేసిన ఈ కారు ధర ఏకంగా రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. సాధారణంగా త్రివిక్రమ్ ఈ తరహా విషయాలను మీడియాకు తెలియజేయడానికి ఇష్టపడరు. కానీ సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారుతున్నాయి. తాజాగా త్రివిక్రమ్ బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేయగా.. ఈ కారు ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. త్రివిక్రమ్ కొత్త కారు చాలా బాగుందని నెటిజన్ల నుంచి కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

మరో ఒకవైపు త్రివిక్రమ్ – మహేష్ బాబుకు కెరియర్ లోనే బెస్ట్ హిట్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. త్రివిక్రమ్ అంతకంతకు పెరుగుతుండగా ఫ్యామిలీ కథలకు ఎప్పుడు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉండడం ఇప్పుడు మరో టాపిక్ అవుతోంది. అయితే ఎప్పటిలాగే ఒకే తరహా కథలతో చాలా సంవత్సరాల పాటు కెరియర్ ను కొనసాగించిన త్రివిక్రమ్ ఈసారి మహేష్ బాబుతో ఎలాంటి సినిమాలు తెరకెక్కిస్తారో చూడాలి ఉంది. ప్రస్తుతం మరొకవైపు త్రివిక్రమ్ భార్య కూడా నిర్మాతగా కెరియర్ ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ ఒక్కో సినిమాకు రూ.30 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారు.