ఈ వారం థియేటర్‌లో రెండే చిత్రాలు.. ఓటీటీలో ఎన్నో తెలుసా?

వేసవి సినిమాల సందడి తర్వాత జులై నెల పూర్తిగా నిరాశపరిచింది. గత నెలలో విడుదలైన ఒక్క సినిమా కూడా ప్రేక్షకుడిని మెప్పించలేకపోయింది. ఈ క్రమంలో ఆశలన్నీ ఆగస్టుపైనే ఉన్నాయి. మరి ఆగస్టు మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రాలేంటో చూసేద్దామా!

బింబిసార

శరణు కోరితే ప్రాణ భిక్ష. ఎదిరిస్తే మరణం అంటున్నారు కల్యాణ్‌ రామ్‌. ఆయన కథానాయకుడిగా వశిష్ఠ్‌ తెరకెక్కించిన చిత్రం బింబిసార. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై హరికృష్ణ.కె నిర్మించారు. సంయుక్తా మేనన్‌ కేథరిన్‌ కథానాయికలు. ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. చరిత్రకు వర్తమానానికి ముడిపెడుతూ సాగే విభిన్నమైన సోషియో ఫాంటసీ చిత్రమిది. ఇందులో కల్యాణ్‌ రామ్‌ బింబిసారుడిగానే కాక మరో స్టైలిష్‌ అవతారంలోనూ కనిపించనున్నారు. కల్యాణ్‌రామ్‌ తొలిసారి ఇలాంటి జోనర్‌లో నటిస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

సీతా రామం

మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో నటిస్తున్న ప్రేమకథా చిత్రం. సీతా రామం. మృణాళిని ఠాకూర్‌ కథానాయిక. రష్మిక కీలకపాత్రలో నటిస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను అశ్వనీదత్‌, ప్రియాంకదత్‌ నిర్మిస్తున్నారు. ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సుమంత్‌, గౌతమ్‌ మేనన్‌, ప్రకాష్‌ రాజ్‌ తదితరులు కనిపించనున్నారు.

ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

పక్కా కమర్షియల్‌.. నటీనటులు: గోపిచంద్‌, రాశీఖన్నా, సత్యరాజ్‌, రావు రమేశ్‌ తదితరులు; సంగీతం: జేక్స్‌ బిజోయ్‌; దర్శకత్వం: మారుతి; స్ట్రీమింగ్‌ వేదిక: ఆహా; విడుదల: 05-08-2022

కడువా.. నటీనటులు: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, వివేక్‌ ఒబెరాయ్‌, సంయుక్త మేనన్‌ తదితరులు; సంగీతం: జేక్స్‌ బిజోయ్‌; దర్శకత్వం: షాజి కైలాస్‌; స్ట్రీమింగ్‌ వేదిక: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో; విడుదల: 04-08-2022

డార్లింగ్స్‌… నటీనటులు: అలియా భట్‌, షెఫ్లీ షా, విజయ్‌ వర్మ, రోషన్‌ మాథ్యూ తదితరులు; సంగీతం: విశాల్‌ భరద్వాజ్‌; దర్శకత్వం: జస్మీత్‌ కె.రీన్‌; స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌; విడుదల: 05-08-2022

అమెజాన్‌ ప్రైమ్‌.. ఆల్‌ ఆర్‌ నథింగ్‌ (వెబ్‌ సిరీస్‌) ఆగస్టు 04

క్రాష్‌ కోర్స్‌ (హిందీ సిరీస్‌) ఆగస్టు 05

థర్టీన్‌ లైవ్స్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 05

నెట్‌ఫ్లిక్స్‌

కార్టర్‌ (కొరియన్‌ మూవీ) ఆగస్టు 05

ద శాండ్‌ మాన్‌ (వెబ్‌ సిరీస్‌) ఆగస్టు 05

డిస్నీ+హాట్‌ స్టార్‌

లైట్‌ ఇయర్‌ (తెలుగు డబ్బింగ్‌) ఆగస్టు 03

ఆహా

మహా (తమిళ చిత్రం )ఆగస్టు 05

వూట్‌

గ్రేట్‌ వెడ్డింగ్‌ ఆఫ్‌ మున్నేస్‌ (హిందీ) ఆగస్టు 04