Krishna Vamsi: తుది దశకు చిత్రీకరణ..కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ వచ్చేస్తోంది..

-

టాలీవుడ్ సీనియర్ అండ్ క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగమార్తాండ ’ఫిల్మ్ కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీతో జనాలకు తన స్టైల్ పిక్చర్ ఎలా ఉంటుందో మరోసారి తెలపాలనుకుంటున్నాడట డైరెక్టర్.

మరాఠీ సూపర్ హిట్ ఫిల్మ్ ‘నటసామ్రాట్’కు అఫీషియల్ తెలుగు రీమేక్ గా వస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ ఇళయరాజా అందిస్తున్నారు. ఇటీవల ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కంప్లీట్ చేశారు. ఈ క్రమంలోనే కొంత షూటింగ్ పార్ట్ మిగిలి ఉండగా, దానిని ప్రజెంట్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొంత భాగం షూటింగ్ అయిన తర్వాత..డైరెక్టర్ వరుసగా సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తారని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్.

కొవిడ్ వలన ఈ ఫిల్మ్ షూటింగ్ వాయిదా పడగా, దీనిని OTTలోనే విడుదల చేస్తారని వార్తలొచ్చాయి. కాగా, థియేటర్లలోనే విడుదల చేయాలని మేకర్స్ భావించారు.

అలా ఈ ఫిల్మ్ ను టాకీసులోనే అతి త్వరలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రకాశ్‌రాజ్‌, బ్రహ్మానందం, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీకి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news