“వాల్తేరు వీరయ్య”లో నావీ ఆఫీసర్ గా ఊర్వశి..ఫోటోలు వైరల్

-

గాడ్ ఫాదర్ తో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వాల్తేరు వీరయ్య గా అభిమానుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్ అలాగే టీజర్లు ఫ్యాన్స్ ను ఉర్రుతలూగించాయి. ఇటీవలే వాల్తేరు వీరయ్య గా టైటిల్‌ ను అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం. ఇక తాజాగా మరో బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతలా నటిస్తోన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ వార్తలు నిజం చేస్తూ.. ఇప్పుడు ఫోటోలు వైరల్‌ అయ్యాయి. వాల్తేరు వీరయ్య లో నావీ ఆఫీసర్‌ గా ఊర్వశి రౌతలా నటిస్తోందట. ఇందులో భాగంగానే.. సెట్‌ లో చిరుతో ఊర్వశి దిగిన ఫోటోలు వైరల్‌ అయ్యాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news