పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ రీస్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కూడా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇతర సినిమాల నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. విషయం ఏంటంటే వకీల్ సాబ్ చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్, వకీల్ సాబ్ చిత్రీకరణని తొందరగా పూర్తి చేసి సంక్రాంతి బరిలో నిలపాలని చూస్తున్నాడట. అదే ఇప్పుడు ఇతర చిత్రాల వారికి టెన్షన్ లా మారింది.
50శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లు తెరుచుకోవచ్చని ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ కావడం లేదు. అటు సినిమా వాళ్ళు కూడా 50శాతం సీటింగ్ అంటే నష్టపోతామన్న ఉద్దేశ్యంతో సినిమాలు రిలీజ్ చేయట్లేదు. సంక్రాంతి వరకు ఈ పరిస్థితి మారవచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే ఆల్రెడీ నాలుగు సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్నాయి. ఇప్పుడు వకీల్ సాబ్ కూడా చేరే అవకాశం ఉంది.
దీనివల్ల కాంపిటీషన్ బాగా పెరగనుంది. మరి అంతా అనుకున్నట్టు జరుగుతుందా లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.