చీర కట్టులో చెమటలు పట్టిస్తున్న వీరసింహారెడ్డి భామ..!

-

హనీ రోజ్.. గత కొంతకాలం క్రితం వరకు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని పేరు. కానీ ప్రస్తుతం ఈమె గురించి ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకోవడానికి ఈమెకు వీరసింహారెడ్డి సినిమా చక్కటి అవకాశాన్ని అందించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ఈమె పేరు వినిపిస్తూ ఉండడం గమనార్హం. నిజానికి ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన అందాలతో కుర్రాలకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ . ఇకపోతే సినిమాలలో హాట్ షో చేసిన హనీ రోజ్.. సోషల్ మీడియాలో కూడా అంతకుమించి అనేలా గ్లామర్ వొలకబోస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా ఎరుపు శారీలో హనీ చిరునవ్వులు చిందిస్తూ అందాల విందు చేసిందని చెప్పవచ్చు. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసిన ఈమె లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా ఈమెకు మరింత మందిని అభిమానులుగా మారుస్తోంది.

ఇకపోతే నటసింహ బాలకృష్ణ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకులను వీరసింహారెడ్డి సినిమాతో పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో వీరసింహారెడ్డి, జై సింహ రెడ్డి గా బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. బాలయ్య సరసన శృతిహాసన్ హనీ రోజ్ ఇద్దరూ నటించడం జరిగింది.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. వీరసింహారెడ్డి సినిమా శృతిహాసన్ కంటే హనీ రోజ్ కి ఎక్కువ క్రేజ్ ఇచ్చిందని చెప్పవచ్చు. వీరసింహారెడ్డి మరదలు మీనాక్షి పాత్రలో ఈమె చాలా అద్భుతంగా ఒదిగిపోయింది. తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేసి అందాలతో అందరిని ఉలిక్కిపడేలా చేసింది. మొత్తానికి అయితే మలయాళంలో సినిమాలు చేసుకుంటూ అక్కడే పరిమితమైన ఈమె ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ లో కూడా మరింత పేరు దక్కించుకుందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version