వెంక‌టేశ్‌ 75వ సినిమా ఆ డైరెక్ట‌ర్‌తోనేనా..!

-

‘ఎఫ్-2’తో ఫుల్‌ఫామ్‌లోకి వచ్చేశాడు వెంకటేశ్. ‘ఎఫ్-2’ చిత్రంతో కథానాయకుడిగా 73 సినిమాలు పూర్తిచేశాడు. 74వ చిత్రంగా ‘వెంకీ మామ’ను ఫిబ్రవరి నుంచి పట్టాలెక్కిస్తున్నాడు. అయితే తన ప్రతిష్ఠాత్మక 75వ చిత్రాన్ని కెరీర్‌లో గుర్తుండిపోయేలా నిలపాలనే ఆలోచనతో ఉన్నాడట వెంకటేశ్. ఇక `వెంకీ మామ‌` సినిమా తరువాత వెంకటేశ్ ‘అసురన్’ రీమేక్లో చేయనున్నాడు. తమిళంలో ధనుశ్ చేసిన ఈ సినిమా దసరాకి విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది వెంకటేశ్ కి 74వ సినిమా అనీ, సురేశ్ ప్రొడక్షన్స్ లో నిర్మితమవుతుందని సురేశ్ బాబు చెప్పారు.

దాంతో వెంకటేశ్ 75వ సినిమా ఏ దర్శకుడితో వుండనుందనే విషయాన్ని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్ తో ఒక సినిమా చేయనున్నట్టుగా తరుణ్ భాస్కర్ చెప్పాడు. కానీ వెంకటేశ్ 75వ సినిమా దర్శకుడిగా తాజాగా త్రివిక్రమ్ పేరు తెరపైకి వచ్చింది. ఆయనే ఈ సినిమాకి దర్శకుడనే మాట ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news