ఎఫ్-2 కథ అదేనా..!

-

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత వెంకటేష్ చేస్తున్న మల్టీస్టారర్ మూవీ ఎఫ్-2. సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ వస్తున్న ఈ సినిమాలో హీరోలిద్దరు భార్యా బాధుతులని తెలుస్తుంది. భార్య చేత బాధించబడే హీరోలిద్దరు ఏం చేశారు అన్నదే సినిమా కథ.

పక్కా ఫన్ ఎలిమెంట్ ఉన్న కథ. వరుణ్ తేజ్ కూడా ఇందులో భార్యా బాధితుడిగా కనిపిస్తాడట. వెంకటేష్ మార్క్ కామెడీ పంచేందుకు ఈ సినిమా పర్ఫెక్ట్ అని అంటున్నారు. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ ఇలా వరుసగా మూడు సినిమాలు హిట్ కొట్టి దర్శకుడిగా తన సత్తా చాటుతున్నాడు అనీల్ రావిపుడి. కచ్చితంగా ఈ ఎఫ్-2 అందరు మెచ్చేలా తీస్తాడనడంలో సందేహం లేదు.

వెంకటేష్ కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్ కు జతగా మెహ్రీన్ నటిస్తున్న ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. గురు తర్వాత వెంకటేష్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీనితో పాటుగా నాగ చైతన్యతో కూడా వెంకటేష్ ఓ మల్టీస్టారర్ చేస్తుండటం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news