మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. వంద కుటుంబాల ఎంపిక.. ఇదిగో లిస్ట్

-

టాలీవుడ్ రౌడీ హీరో ప్రస్తుతం ఖుషి మూవీ సక్సెస్​ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ హీరో ఖుషి సక్సెస్ తర్వాత 100 కుటుంబాలకు సాయం చేస్తానని హామీ ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం వంద కుటుంబాలను ఎంపిక చేశాడు. ప్రతి కుటుంబానికి రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేయనున్నాడు. ఈ కుటుంబాల జాబితాను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశాడు.

‘‘ఈ సారి మేము 100 కుటుంబాలను ఎంపిక చేశాం. నేను చేసే చిరు సాయం మీ కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతుందని భావిస్తున్నా’’ అని ఆయన విజయ్ ట్వీటాడు. ట్వీట్‌ చేశారు. జాబితాలో ఉన్న కుటుంబాలకు త్వరలోనే విజయ్‌ చెక్కులను అందజేయనున్నట్లు తెలుస్తోంది.

విజయ్‌ దేవరకొండ – సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి టాక్‌ అందుకుంది. వైజాగ్‌లో నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో విజయ్‌ దేవరకొండ వంద కుటుంబాలను ఎంపిక చేసి తన సంపాదన నుంచి రూ.కోటిని (ఒక్కో ఫ్యామిలీకి రూ.లక్ష చొప్పున) పది రోజుల్లో అందిస్తానని హామీ ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పనిలో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version