విజయ్ దేవరకొండ-మృణాల్​ సినిమా టైటిల్ ఇదే..!

-

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్​ను మలుపు తిప్పిన సినిమాల్లో ‘గీత గోవిందం’ కూడా ఒకటి. ఇప్పుడు ఆ సినిమా దర్శకుడు పరశురామ్​తో విజయ్ మరో సినిమాలో నటిస్తున్నారు. ‘VD 13’గా తెరకెక్కుతున్న సినిమా కోసం పని చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమం గ్రాండ్​గా స్టార్ట్ అయ్యింది. రెగ్యులర్​ షూటింగ్​ కూడా ప్రారంభం కాకుండానే ఈ సినిమా గురించి తాజాగా ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు​ ‘ఫ్యామిలీ స్టార్‌’ అనే టైటిల్ పెట్టనున్నారట. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్​ సన్నాహాలు చేస్తున్నారట. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై శిరీష్‌, దిల్‌రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ ప్రారంభమైంది. ఇందులో విజయ్​ సరసన ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్​ నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి గోపీసుందర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version