తమన్నా.. ఓ ఐకాన్.. మిల్కీ బ్యూటీపై బాయ్​ఫ్రెండ్ ప్రశంసల జల్లు

-

తన గర్ల్​ఫ్రెండ్ తమన్నా భాటియాపై విజయ్ వర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ ఇద్దరు కలిసి నటించిన లస్ట్ స్టోరీస్-2 వెబ్​ సిరీస్​ ప్రమోషన్స్​లో భాగంగా ఓ ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ టామీతో కలిసి పనిచేయడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ సిరీస్​లో ఆ పాత్రకు తమన్నా మాత్రమే కరెక్ట్​గా సరిపోతుందని చెప్పాడు.

‘‘స్క్రిప్ట్‌ చదవగానే హీరోయిన్‌ పాత్రలో ఎవరు నటిస్తున్నారని అడిగాను. తమన్నా అని చెప్పగానే సరైన ఎంపికగా అనిపించింది. నిజానికి ఆ పాత్రకు ఆమె కరెక్ట్‌గా సరిపోయింది. దానికి మరింత గ్లామర్‌ను తెచ్చింది. తను నటించే పాత్రలో ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలిస్తుంది. చాలా శ్రద్ధగా పని చేస్తుంది. ఆమె మాత్రమే అలా చేయగలదు. మన తోటి నటీనటులు ఉత్సాహంగా ఉన్నప్పుడు షూటింగ్‌ సరదాగా ఉంటుంది. ఆమె ఐకాన్‌. నేను తమన్నా నటించిన ‘బాహుబలి’ని థియేటర్లో చూశా.. తాజాగా ఆమె నటించిన ‘బబ్లీ బౌన్సర్‌’ను చూశాను వాటిల్లో ఆమె నటన చూసి ఆశ్చర్యపోయాను. లస్ట్‌ స్టోరీస్‌-2 చూశాక మీరంతా కూడా ఆమె నటనను ప్రశంసిస్తారు’’ అని చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version