సాధారణంగా ఎక్కడైనా సరే సినిమా వాళ్ళ జీవితాలు చాలా కలర్ ఫుల్ గా ఉంటాయని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే వాళ్లు చేసే రిస్క్ ఇంకొకరికి ఉండదు అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా సినిమా షూటింగ్లో ఏ మాత్రం అదుపుతప్పినా సరే గాయాల పాల అవడమే కాదు సర్జరీలు, నెలల పాటు బెడ్ రెస్ట్ లు ఒక్కోసారి ఇక జీవితాంతం వికలాంగులు గానే మిగిలి పోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వీరికి వచ్చే పారితోషకం కూడా వీరి అనారోగ్య సమస్యలను బాగు చేసుకోవడానికి ఏమాత్రం సరిపోదనే కామెంట్లు కూడా వినిపిస్తూ ఉంటాయి.
ముఖ్యంగా స్టార్ హీరోలకు, హీరోయిన్లకు ఈ సమస్య లేకపోయినా చిన్న హీరోలు, హీరోయిన్లకు అయితే ట్రీట్మెంట్లో అయ్యే ఖర్చులో సగం చెల్లించాల్సి ఉంటుంది. మిగిలింది నిర్మాణ సంస్థ చెల్లిస్తుందని కొంతమంది నటీనటులు చెబుతూ ఉంటారు. అయితే ఒకానొక సమయంలో నటుడు నూతన ప్రసాద్ కి ఒక సినిమా షూటింగ్లో జరిగిన ప్రమాదంలో ఆయన వెన్నెముకకు గాయం అవ్వడంతో ఇప్పటికీ ఆయన వీల్ చైర్ లోనే కూర్చోవాల్సి వచ్చింది. అయినా కూడా ఆయన చాలా సినిమాలలో నటించారు. ఇప్పుడు విశ్వక్సేన్ హీరోయిన్ కి కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది.
మొన్నామధ్య విస్వక్ సేన్ హీరోగా వచ్చిన ముఖచిత్రం సినిమాలో హీరోయిన్లుగా ప్రియా వడ్లమాని , ఆయేషా ఖాన్ లు నటించిన విషయం తెలిసిందే. అయితే కార్ యాక్సిడెంట్ శీను చిత్రీకరిస్తున్న సమయంలో ఆమెకు అనుభవం లేకపోవడం వల్ల నిజంగానే గాయపడిందట. అయితే ఇక్కడ సీనియర్ నటుడు నూతన ప్రసాద్ లాగే ఆమెకు కూడా సేమ్ ఆక్సిడెంట్ జరిగిందని.. నడుము వెన్ను భాగంలో పెద్ద గాయం తగిలిందని సమాచారం. కానీ ఆమె బరువు తక్కువగా ఉండడం వల్ల త్వరగా కోలుకుందని. లేదంటే ఆమె జీవితాంతం వీల్ చైర్ కే పరిమితం అయ్యేదని.. చిత్రబృందం తాజాగా వెల్లడించింది.