పెళ్లి చేసుకోవాలనే ఉంది కానీ అదే అసలు సమస్య.. పరిణితి చోప్రా వైరల్ కామెంట్స్

-

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా తాజాగా ప్రేమ, పెళ్లి, రిలేషన్షిప్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. త్వరలోనే తనకు పెళ్లి చేసుకోవాలని ఉందంటూ కానీ ఎందుకు చేసుకోవడం లేదో చెప్పుకొచ్చారు..

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కజిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నటి పరిణితి చోప్రా. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఎన్నో చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. కెరియర్ లో నటించిన చిత్రాల్లో ఎక్కువగా హిట్స్ లేకపోయినా తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పరిణితి రిలేషన్షిప్ పై వైరల్ కామెంట్స్ చేసింది..

ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో పెళ్లిళ్లు ఎక్కువగానే జరుగుతున్నాయి. పలువురు ప్రేమ జంటలు ఏడడుగుల బంధం లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు షాకింగ్ కామెంట్ చేసింది పరిణితి. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటూ రిపోర్టర్ అడగగా..
“ప్రస్తుతం తను ఎవరితోనూ రిలేషన్ షిప్ లో లేనని.. అయితే తొందరలోనే తనకు పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ వరుడు దొరకటం లేదు. బాలీవుడ్లో జరుగుతున్న పెళ్లిళ్లు చూస్తుంటే నాకూ మింగిల్ అవ్వాలని ఆలోచన పెరిగిపోతుందంటూ..” చెప్పుకొచ్చింది.. కానీ ప్రస్తుతం తను సింగిల్ అవ్వటం వల్ల ఆ అవకాశం లేదని తెలిపింది..

Parineeti Chopra movies, filmography, biography and songs - Cinestaan.com
అలాగే తాజాగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కీయారా అద్వానీ, అలియా భట్ తనకు మంచి స్నేహితులేనని తెలిపింది. వీళ్లంతా పెళ్లి చేసుకుని మంచిగా సెటిల్ అయ్యారని నాకు అలాగే ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఇన్నాళ్లు ఉండేది అంటూ చెప్పకు వచ్చింది. అయితే ప్రస్తుతం మాత్రం ఆ ఆలోచన మార్చుకున్నాను అని తెలిపింది. అలాగే సరదాగా నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అబ్బాయి ఉంటే చూడండి అంటూ సరదా కామెంట్స్ విసిరింది..

Read more RELATED
Recommended to you

Latest news