రకుల్ కండోమ్ టెస్టర్ గా ఉండడం పై తన తల్లి ఏమందంటే..?

-

గత కొద్ది రోజుల క్రితం వరకు కూడా టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల కాలంలో టాలీవుడ్ నుంచి ఆఫర్లు రావడం పూర్తిగా తగ్గిపోయాయి . ఈ క్రమంలోనే బాలీవుడ్ కి మకాం మార్చిన రకుల్ ప్రీతిసింగ్ ప్రస్తుతం ఆరు సినిమా ప్రాజెక్టులతో బిజీగా షూటింగ్లలో పాల్గొంటుంది.. ప్రస్తుతం బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టిన రకుల్ ప్రీతిసింగ్ సందర్భాన్ని బట్టి సౌత్ సినిమాలపై అప్పుడప్పుడు ఈ అమ్మడు సెటైర్లు గుప్పించడం పరిపాటిగా మారిన విషయం తెలిసిందే. సౌత్ ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ ఆఫర్లపై వ్యాఖ్యానించడమే ఈమెకు కాస్త నెగిటివ్ తెచ్చిపెట్టింది. అలాగని అవకాశాలు రాకపోలేదు. శంకర్ ఇండియన్ 2 లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సంగతి పక్కన పెడితే బాలీవుడ్ ప్రాజెక్టు డాక్టర్ జీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు ఈ సినిమా మంచి హైప్ తీసుకొచ్చాయి. ఆర్థోపెడిక్ డాక్టర్ అవ్వాలనుకున్న హీరో గైనకాలజిస్ట్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది? అన్నది ఆద్యంతం వినోదాత్మకంగా మలిచారు. ఇక ఈ సినిమాలో రకుల్ కండోమ్ టెస్టర్ పాత్రలో నటిస్తోంది ఇలాంటి రోల్ చేయాలంటే ఎవరికైనా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. తేడా జరిగితే ట్రోలింగ్ తప్పదు. కానీ రకుల్ ఈ పాత్రను చాలా పాజిటివ్ గా తీసుకొని చేసినట్లు తెలుస్తోంది.ఇదే కాదు ఈ పాత్ర విషయంలో ఎన్ని సవాల్ ఎదురైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ చెప్పకనే చెప్పేసింది. ఇకపోతే ఈ రోల్ గురించి మీ ఇంట్లో తల్లిదండ్రులకు తెలుసా ? అని ప్రశ్నిస్తే.. దీటైన బదులిచ్చి అందరినోళ్లు మూయించింది. సామాజిక సమస్యలపై చర్చకు తెరతీసే చిత్రాలు అందుకే వీటిని నా తల్లిదండ్రులు గొప్ప ఆలోచనగా భావించారు .. నన్ను ఎంతగానో ప్రోత్సహించారు.

డాక్టర్ జి లో గైనకాలజిస్ట్ అయిన ఒక పురుష వైద్యుడు గురించి చర్చించాము . మన వద్ద ఇలాంటి వాటిపై నిషేధం ఉండడం దురదృష్టకరం . గుండె, మెదడు, ఊపిరితిత్తులు, కిడ్నీలు ఇలా శరీరంలో ఇతర వ్యవస్థల కంటే పునరుత్పత్తి అవయవాన్ని ఎందుకు భిన్నంగా చూడాలి. శరీరంలో ఏ భాగానికి జబ్బు చేసినా చికిత్స చేయడం వైద్యుడు పని.. ఆ వైద్యుడు మగవాడు అయితే ఏంటి? మహిళ అయితే ఏంటి? దాని పైనే మేము డాక్టర్ జీలో చాలా లోతుగా చూపించబోతున్నాము. మన ఆలోచన విధానాన్ని బట్టి మన ప్రవర్తన తీరు ఆధారపడి ఉంటుంది.. ఇక నిజమైన తప్పును తప్పుగా చూపించాము. ఇలాంటి వాటి విషయాల్లో మాత్రం చాలా పరిమితులు గుర్తుకొస్తాయి అంటూ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news