టీవీ సీరియల్ నటుడు ఒకరికి తెలియకుండా మరొకరితో..!!

-

సినిమా పరిశ్రమలో సహజీవనం చేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కామన్ గా మారింది . ఇప్పుడు సీరియల్స్ రాకతో అది పెద్ద పరిశ్రమగా మారింది. దీనితో ఇక్కడ నటించే వారు కుప్పలు తెప్పలుగా పెరిగారు. దీనితో రెండు పెళ్లిళ్లు చేసుకోవడం తర్వాత ఎవరికి తెలియకండా వేరే చోట కాపురాలు పెట్టేస్తున్నారు. ఈ సోషల్ మీడియా కాలంలో ఇది కచ్చితంగా ఎక్కడో చోట బయట పడే అవకాశం ఉంది. దీనితో మొదటి భార్యకు,రెండో భార్యకు గొడవలు జరగడం సాధారణంగా మారింది. 

తాజాగా కోలీవుడ్ సీరియల్ దివ్య-అర్ణవ్ ల వ్యవహారం హద్దులు దాటి పొయింది. అర్ణవ్-దివ్య ఇద్దరూ ఓ సీరియల్లో నటిస్తూ ప్రేమించుకున్నారు. తర్వాత పెళ్లి చేసుకున్నారు. తర్వాత వేరే చోట కాపురం పెట్టారు. ప్రస్తుతం దివ్య కడుపుతో వుంది. అర్ణవ్ మాత్రం దివ్య తోనే కాకుండా  వేరే అమ్మాయి అయిన అన్షితతో కూడా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. దీనితో  దివ్య ఇద్దరిపై పోలీస్ కేసు పెట్టింది. అంతేకాదు తమకు వివాహం అయిందని , ఆమె తన భర్తను వలలో వేసుకుందని పక్కా ఆధారాలు సమర్పించింది. తాను గర్భవతిగా ఉన్నా కూడా తనను తన భర్త వేధిస్తున్నాడని పోలీసులతో చెప్పి కన్నీరు పెట్టుకుంది.  తాజాగా దివ్య ,అన్షిత అర్ణవ్ ముగ్గురి మధ్య జరిగిన ఫోన్ కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఈఫోన్ కాల్ లో దివ్య.. అన్షిత తో “ఒక ఆడదానివై ఉండి మరో ఆడదాని కాపురాన్ని చెడగొడతావా అని అనడంతో పాటు నీకు దండం పెడతాను ప్లీజ్ నా భర్తను వదిలేయ్ అని దివ్య అంటుండగా. నీపై నాకు అసహ్యం, కోపంగా ఉంది నాకు అని అన్షిత రివర్స్ అయ్యింది. నా భర్తను వదిలి పెట్టు అన్నాగాని దివ్య లైన్ లో వుండగానే  అన్షిత అర్ణవ్ కు ఐ లవ్ యూ చెప్పి ముద్దులు పెడుతుంది. దీనితో  ఇద్దరి మధ్య గొడవ తీవ్ర రూపం దాల్చింది. దీనితో ఇద్దరూ బండ బూతులు తిట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది విన్న చాలా మంది ఆడవాళ్ల కోసం మగవాళ్ళు కొట్టుకోవడం కాదు, ఈ రోజుల్లో మగాళ్ల కోసం ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారు అని కామెంట్స్ పెడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news