మణిరత్నం చిత్రాల్లో సుహాసినికి అవకాశాలు రాలేదా.. సీనియర్ హీరోయిన్ కామెంట్స్ ఇవే..!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుహాసిని..దేశం గర్వించే దర్శకుడు మణిరత్నంను పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ విదితమే. మణిరత్నం తెరకెక్కించే సినిమాల కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు, ప్రజలు ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. త్వరలో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియిన్ సెల్వన్’ విడుదల కానుంది. ఈ సంగతులు పక్కనబెడితే.. మణిరత్నం చిత్రాల్లో ఆయన భార్య సుహాసినికి అవకాశం లభించలేదా? అందుకు గల కారణాలేంటో తెలుసుకుందాం.

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సినిమాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల్లో ఒక్క చిన్న పాత్ర అయినా పోషించాలని నటీనటులందరూ అనుకుంటారు కూడా. ఎవరి దగ్గర అసిస్టెంట్ గా పని చేయని మణిరత్నం.. సినిమా మేకింగ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకోవడం విశేషమని చెప్పొచ్చు.

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో పని చేసిన నటీ నటులు ఇప్పుడు స్టార్స్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఎంతో మంది నటీ నటులకు అవకాశం ఇచ్చిన మణిరత్నం.. తన సినిమాలో తన భార్య సుహాసినికి అవకాశం ఇవ్వలేదు. ఈ విషయమై సుహాసిని అడగగా, తనకు ఎప్పుడూ మణిరత్నం చిత్రాల్లో నటించాలని అనిపించలేదని చెప్పడం గమనార్హం. అయితే, భవిష్యత్తులో అయినా నటించే అవకాశాలు ఉండొచ్చని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియిన్ సెల్వన్’లో భారీ తారాగణమే ఉంది. ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష, కార్తీ, విక్రమ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా డెఫినెట్ గా రికార్డులు తిరగరాస్తుందని మేకర్స్ చెప్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుంది. తొలి భాగం ‘పొన్నియిన్ సెల్వన్-1’ ఈ ఏడాది సెప్టెంబర్ 30న విడుదల కానుంది.