నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో .. ప్రకటించిన వైవీఎస్ చౌదరి

-

నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అరడజనుకు పైగా హీరోలు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. వారిలో చాలా మంది సూపర్ సక్సెస్ను రుచి చూసి ఉన్నత శిఖరాలకు చేశారు. ఇక ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు వైవీఎస్ చౌదరి అధికారికంగా ప్రకటించారు.

తన భార్య గీత నిర్మాతగా న్యూ టాలెంట్‌ రోర్స్‌ అనే కొత్త బ్యానర్‌ను వైవీఎస్‌ ప్రారంభించారు. ఈ బ్యానర్‌పై రానున్న తొలి సినిమాతోనే నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగోతరం హీరోను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించారు. ‘సీనియర్‌ ఎన్టీఆర్‌ మునిమనవడు.. హరికృష్ణ మనవడు.. దివంగత జానకిరామ్‌ పెద్ద కుమారుడు నందమూరి తారక రామారావును నేను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నందుకు గర్వంగా ఉంది. హరికృష్ణతో సినిమాలు తీసే అదృష్టం నాకు దక్కింది. ఇప్పుడు ఆయన మనవడిని కూడా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నా’ అని వైవిఎస్‌ చౌదరి ఆనందం వ్యక్తం చేశారు. ఇందులో తెలుగుఅమ్మాయిని హీరోయిన్‌గా తీసుకోనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version