వర్షం పడుతున్నట్లు కల వచ్చిందా..? లక్ష్మీదేవి కటాక్షం ఇక మీపై కురిసినట్లే..!!

-

వర్షం: నిద్రపోతున్నప్పుడు మనకు ఎన్నో కలలు వస్తుంటాయి.. ఆ కలల్లో ఏవేవో కనిపిస్తాయి.. కలలను లైట్‌ తీసుకోవడానికి లేదు..భవిష్యత్తుకు సంకేతాలే ఈ కలలు. లక్ష్మీదేవి రావడానికి ముందే కొన్ని ప్రత్యేక సంకేతాలు మనకు కనిపిస్తాయని పండితులు అంటున్నారు. అలాంటి సంకేతాలు కనిపిస్తే చాలా పెద్ద ధనలాభం కలుగబోతోందట.. మీకు కలలో ఇవి కనిపించాయంటే.. దాని అర్థం మీకు త్వరలో ధనలాభం కలుగుతుందని. మరి స్వప్న శాస్త్రం ప్రకారం.. అవేంటో చూద్దామా..!

వర్షం పడుతున్నట్టు
మీకు కలలో వర్షం పడుతున్నట్టు చూస్తే త్వరలో మీ పైన సంపద వర్షంలా కురుస్తుందని సంకేతం. మీ ఆర్థిక స్థితి మెరుగవుతోందనేందుకు సూచనగా స్వప్నశాస్త్రం చెబుతోంది. త్వరలో కష్టాలు తొలగి ఆనందాలు మీ సొంత కాబోతున్నాయని అర్థం.

ఎర్రని చీర
స్త్రీలకు తాము ఎర్రని చీర ధరించినట్టు కల వస్తే త్వరలో ఆమెకు లక్ష్మీకటాక్షం కలుగబోతుందని అర్థమట..

పసుపు పండు
కలలో చాలా సార్లు పసుపు రంగు పండు కలలో కనిపిస్తే అదృష్టం కలిసి వస్తుందని అర్థం. కలలో పసుపు రంగు పండు కనిపిస్తే అది లక్ష్మీ ఆగమనానికి సంకేతమట. ఇది కాకుండా, కలలో ఎరుపురంగు పువ్వులు కనిపిస్తే.. మీకు ఆర్థిక ఇబ్బందులు త్వరలో తొలగిపోతున్నాయని అర్థం.

గొప్ప దేవాలయ సందర్శన
కొన్ని సార్లు కలలో ప్రముఖ దేవాలయాలను సందర్శించినట్టు కల వస్తుంది. ఇది చాలా శుభప్రదమైన కల. స్వప్నశాస్త్రం ప్రకారం.. ఆలయ సందర్శన వల్ల జీవితంలోని సమస్యలు తొలగిస్తాయి. అలాంటి కలలు లక్ష్మీ, కుబేర ఆశీర్వదం లభిస్తుంది.

బావి కనిపిస్తే
కొంత మందికి కలలో బావి కనిపిస్తుంది. చాలామంది ఇది చెడుకు సంకేతం అనుకుంటారు.. కలలో చిన్న గొయ్యి, బావి, లేదా గుంట కనిపిస్తే అది నిక్షిప్తం చేసిన నిధికి సంకేతమట… కనుక కలలో ఇలాంటివి కనిపిస్తే త్వరలో మీకు ఏదో పెద్ద ధనరాశి లభించబోతోందని అర్థం.

పర్వతం ఎక్కినట్టు
చాలా సార్లు పర్వతం ఎక్కుతున్నట్టు కలలు వస్తాయి. ఇలాంటి కలలు చాలా మంచివి.. జీవితంలో పురోగతి కోసం కొత్త దారులు ఏర్పడబోతున్నాయని అర్థం. ఉద్యోగస్తులు చాలా మంచి మార్పులు కలుగవచ్చు.

పువ్వులు
కలలో పువ్వులు కనిపిస్తే చాలా శుభప్రదం. కోసిన పువ్వులు, లేదా పువ్వుల చెట్టు వంటివి కనిపిస్తే త్వరలో చాలా మంచి రోజులు రానున్నాయని అర్థం.

తెల్లని ఏనుగు
కలలో తెల్ల ఏనుగు కనిపించడం చాలా మంచిది.. తెల్ల ఏనుగు ఏ ప్రదేశంలో నైనా సరే నిక్షిప్త నిధి ఉంటుందని అర్థం. ఇది ఆకస్మికంగా ధన లాభం కలుగుతుందని చెప్పేందుకు ఇదొక సంకేతం.

పాలిస్తున్న ఆవు
చిన్న లేగ దూడకు ఆవు పాలు ఇస్తున్నట్టు కనిపిస్తే చాలా శుభప్రదం. ఇది ఆకస్మిక లక్ష్మీ కటాక్షానికి సూచిక అని పండితులు అంటున్నారు.. పూర్వీకుల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుందట.

చీమలు కనిపిస్తే
చీమలు కూడబెట్టడానికి చిహ్నం. కలలో చీమలు కనిపిస్తే రాబోయే రోజుల్లో ఆర్ధికంగా ఎదగబోతున్నారని అర్థం.

ఇందులో ఏది మీ కలలో. కనిపించినా మీ దశ మారిపోతుందని స్వప్న శాస్త్రం చెప్తుంది.. అయితే ఇలాంటివి నమ్మని వాళ్లూ ఉంటారు.. మనం ఏం చేయలేం..!

Read more RELATED
Recommended to you

Exit mobile version