శాస్త్రవేత్తలకు అంతుచిక్కని అద్భుతాలను కలిగి ఉన్న దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా..?

-

అప్పటి రోజుల లో రాజులు మహా తెలివి పరులు ఎవరికీ అంతు చిక్కని విధంగా అద్భుతాలతో దేవాలయాలను నిర్మించారు.వాటికి ఇప్పుడు మంచి ఆదరణను పొందుతున్నాయి.అలాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఆంధ్రప్రదేశ్ లో లెక్క లేనన్ని ఉన్నాయి.అందులో ఒకటి యాగంటి.అంతుచిక్కని అద్భుతాలు దాగివున్నాయి. ఈ దివ్యక్షేత్రంలో కొలువై ఉన్న నందీశ్వరుని విగ్రహం వెనుక పెద్ద రహస్యమే దాగివుంది..ఇప్పటికీ ఎవ్వరూ ఆ విషయం పై ఒక క్లారిటీ ఇవ్వలేదు..ఆ గుడి యొక్క విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

యాగంటిలో ప్రధాన దేవాలయంలో ఉమామహేశ్వర లింగం కొలువై ఉంది. శివపార్వతులు ఇద్దరూ ఒకే లింగంలో దర్శనమివ్వడం ఇక్కడ విశేషం. వాస్తవానికి ఇక్కడ పరమశివుని ఆలయం నిర్మించటానికి ఒక చరిత్ర ఉంది. చాలా సంవత్సరాల క్రితం ఒక రాజు ఈ ప్రదేశంలో వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలని సంకల్పించారు. అదే సమయంలో రాజుకి శివుడు కలలో ప్రత్యక్షమై తనకు ఇక్కడే గుడి కట్టాలని అదేశించాడని, ఆ క్రమంలోనే శివుడు,పార్వతి ఒకే లింగంలో దర్శనమిచ్చేలా ఈ క్షేత్రాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది..అగస్త్య మహాముని చేసిన యాగం వలెనే ఈ క్షేత్రానికి యాగంటి అని పేరు వచ్చిందని చెప్తారు. శైవ క్షేత్రమే అయినా ఈ ఆలయం వైష్ణవాలయాన్ని పోలి ఉంటుంది..

ఈ మహా క్షేత్రంలోని అద్భుతాలు ఏంటో ఇప్పుడు చుద్దాము..

ఈ పుణ్య క్షేత్రం లో ప్రముఖంగా చెప్పబడే యాగంటి బసవన్న స్వయంభువుగా వెలిశాడని చరిత్రచెబుతుంది. మొదట్లో చిన్నగా ఉన్న ఈ నంది విగ్రహం రానురాను పెరుగుతూవచ్చి ఆలయ ప్రాంగణాన్ని ఆక్రమించుకుంది. ఈ విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతుంది.

ఈ బసవన్న విగ్రహం ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని ఏకంగా పురావస్తు శాఖ నిర్ధారించింది. దీనికి సంబంధించిన వివరాలను సైతం ఆలయంలో ఏర్పాటు చేశారు. అంతకంతకు పెరిగిపోతుండటం అటు భక్తులను ఆశ్ఛర్యానికి గురిచేస్తుంది..బ్రహ్మం గారు చెప్పినట్లు అక్కడి బసవయ్య లేచి రంకెలు వేస్తే ప్రపంచం అంతరించి పోతుంది.కర్నూలు జిల్లాలో బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలోనే ఈ యాగంటి క్షేత్రం ఉండటం విశేషం.

ఇకపొతే ఇక్కడ మరో విశేషమేటంటే ఈ క్షేత్రంలో ఒక్క కాకి కూడా కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కాకులు కనిపించకపోవడం వెనుక ఒక పురాణ గాధ ఉంది. అగస్త్య మహా ముని యాగం చేసేటప్పుడు రాక్షసులు కాకి రూపంలో వచ్చి మాంసం ముక్కలను యాగ గుండంలో వేసి ఆటంకం కలిగించారట. దీంతో కోపంతో ఆ మహాముని ఈ క్షేత్రంలో కాకులు తిరగకూడదని శాపం ఇచ్చాడని చెబుతారు. అప్పటినుంచి ఈ ఆలయ పరిసరాల్లో కాకులు తిరగవు.

పుష్కరిణిలో స్నానమాచరిస్తే పుణ్యప్రదం..ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది..నంది ముఖం నుంచి ఎప్పుడూ నీళ్ళు ప్రవహిస్తాయి.ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమౌతాయని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి పర్వదినం రోజున భక్తులు పెద్ద సంఖ్యలో యాంగటిని సందర్శిస్తారు.నంద్యాల నుంచి 48 కిలోమీటర్ల దూరంలో గల బనగానపల్లె పట్టణానికి చేరాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మరో 11 కిమీ ప్రయాణిస్తే యాగంటికి చేరుకోవచ్చు. రోడ్డు సదుపాయం మెరుగ్గా ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా తరలివస్తారు…

Read more RELATED
Recommended to you

Latest news