మనం నిత్యపూజలో షోడషోపచారా పూజలు ముఖ్యం. దీనిలో అత్యంత కీలకమైనది నైవేద్యం. ఆయా దేవుళ్లకు ఆయా నైవేద్యాలు పెట్టి వాటిని ప్రసాదంగా స్వీకరిస్తే విశేష ఫలితాలు వస్తాయి. అయితే దేవునిపై, పూజలు, ఆచారాలపై విశ్వాసం, నమ్మకం చాలా ముఖ్యం. భక్తితో శ్రద్ధతో చేసిన పూజమాత్రమే ఫలిస్తుందని వేదాలు, ఉపనిషత్తులు పేర్కొన్నాయి. ఈ వారం జామ ఫలం దేవునికి నివేదిస్తే కలిగే లాభాలు తెలుసుకుందాం…
– కనకదుర్గ, శారద, లక్ష్మీ తదితర దేవీ సంబంధిత ఆలయాలలో జామకాయను నైవేద్యం పెట్టి సుమంగళిలకు ఆ పండ్లను అందిస్తే షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. పిల్లలు కానివారు ప్రసాదంగా స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది.
– గణపతికి జామపండు నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే ఉదర, గ్యాస్ట్రిక్ సంబంధిత వ్యాధులు నయం అవుతాయి.
– వివాహం కాని అమ్మాయిలు పూజకోసం జామ పండ్లను దేవాలయాలలో ఇస్తే పెండ్లి సంబంధాలు త్వరగా వస్తాయి. అనుకూలంగా ఉంటుంది.
– సంకష్టహర గణపతికి జామపండ్ల నైవేద్యంగా పెట్టి బ్రాహ్మణులకు తాంబూలంతో కలిపి దానం చేస్తే ఆరోగ్యభాగ్యం, శరీరంలో నీరసం తొలిగిపోతుంది.
– రుద్రాభిషేకంలో జామపండ్ల రసాన్ని ఉపయోగిస్తే మీరు చేస్తున్న పనుల్లో ఆలస్యం పోయి వేగంగా జరుగుతాయి. కార్యసిద్ధి.
– ఇంట్లో నిత్యపూజలో జామపండ్లు నైవేద్యంగా పెట్టి పిల్లలకు, పెద్దలకు పంచితే సుఖం, సంతోషం మీ ఇంట్లో నివాసం చేస్తాయి.
– కేశవపంతుల వేంకటేశ్వరశర్మ