భక్తి: మీ ఇంట్లో సిరి సంపదులు కలగాలంటే ఇలా చెయ్యండి…!

-

కొందరు లక్ష్మీ దేవి ఇంటికి రావాలని ఎన్నో పూజలు, నోములు చేస్తూ వుంటారు. అయితే మహాలక్ష్మి అనుగ్రహం కలగాలంటే ఇలా పూజిస్తే తప్పక మీ ఇంట్లో మహాలక్ష్మీ అనుగ్రహం పొంది ఆర్థిక బాధలు తొలగిపోయి. అలానే అప్పులు కూడా తొలగి పోతాయి అని పండితులు అంటున్నారు. కనుక పండితులు చెప్పిన ఈ పద్ధతిని అనుసరించారు అంటే దరిద్రం తొలగి సుఖంగా ఉండవచ్చు.

ఇక అసలు విషయం లోకి వెళితే… శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహం పొందాలంటే కనుక ప్రతీ రోజు ఈ పద్దతిని అనుసరించండి. ఉసిరి అంటే మహా లక్ష్మీకి ఎంతో ఇష్టం. కనుక లక్ష్మీ దేవికి ఉసిరికాయ దీపాన్ని పెట్టి పూజించండి. ముఖ్యంగా శుక్రవారం నాడు చేస్తే మరీ మంచిది. ఇలా శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాన్ని పెట్టి పూజించండి.

ఇలా చేయడం వలన ఆర్థిక బాధలు తొలగి పోతాయి. అంతే కాదు అప్పులు కూడా పూర్తిగా తీర్చుకుంటారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం కలగడమే కాక మీకు మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. మహాలక్ష్మీ దేవికి ఉసిరికాయ దీపం తో హారతి ఇస్తే ఇంట్లో ఉన్న దరిద్రం పోతుంది అని పండితులు చెబుతున్నారు.

అంతే కాదండి ఉసిరి కాయను శ్రీ చక్రానికి నైవేథ్యంగా పెట్టి ఆ తరువాత ఆ ఉసిరిని ప్రసాదంలాగా పంచితే లక్ష్మీ అనుగ్రహం పొంది ఇంట్లో సిరిసంపదలు కలుగుతాయి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కనుక ఈ పద్ధతులని అనుసరించండి. ఆరోగ్యంగా, ఆనందంగా వుండండి.

Read more RELATED
Recommended to you

Latest news