నవంబరు 8 కార్తీక పౌర్ణమి రోజు చంద్ర గ్రహణం..ఈ రాశుల వాళ్ళు చూడకూడదట..!

-

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||

గ్రహణం అంటే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణ సమయం గురించి, గ్రహణం ఎవరు చూడకూడదు వంటి విషయాలను తెలుసుకోవాలి. ఖగోళ, జోతిష్య శాస్త్రాల్లో సూర్య, చంద్ర గ్రహణాలకు ఎంత ప్రాధాన్యత ఉందో మనకు తెలుసు. నవంబరు 8 కార్తీక పౌర్ణమి రోజు చంద్ర గ్రహణం వచ్చింది.

చంద్రగ్రహణం ఎప్పుడు..?

శ్రీ శుభకృత్ నామసంవత్సరం మార్గశిర శుద్ధ పూర్ణిమ నవంబరు 8 మంగళ వారం భరణి నక్షత్రం మూడో పాదంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం వస్తుంది.

గ్రహణ సమయం:

స్పర్శ కాలం మధ్యాహ్నం 2:38 , మధ్య కాలం మధ్యాహ్నం 4:28, మోక్ష కాలం సాయంత్రం 6:18, ఆద్యంత పుణ్యకాలం 3:40.

ఈ నక్షత్రాలు వాళ్ళు చంద్ర గ్రహణాన్ని చూడరాదు:

ఈ గ్రహణాలు జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. జోతిష్య శాస్త్రం కూడా ఇదే చెబుతోంది. చంద్ర గ్రహణం నవంబరు 8 కార్తీక పౌర్ణమి రోజు ఉంది.
భరణి నక్షత్రం మేష రాశి లో పట్టడం వల్ల అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాల వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడరాదు.
చంద్రోదయం సాయంత్రం 5 గంటల 27 నిముషాలకు అవుతుంది. విడుపు సమయంలో 51 నిముషాలు మాత్రమే ఇది కనపడుతుంది.
గ్రహణాన్ని గర్భిణీలు చూడరాదు. అలానే గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక శ్లోకాలు వంటివి చదువుకుంటే మంచిది.

 

Read more RELATED
Recommended to you

Latest news