భర్తకి భార్య కంటే ఎక్కువ వయస్సు ఎందుకు ఉండాలో తెలుసా..?

-

వివాహం జరిపించేటప్పుడు భర్త వయస్సు కంటే భార్య వయసు తక్కువగా ఉండేటట్టు, భర్తకి ఎక్కువగా ఉండేటట్లు చూస్తూ ఉంటారు. అయితే ఎందుకు అలానే ఉండాలి..? పెళ్లి చేసేటప్పుడు ఎందుకు వయసు ఇలా ఉండేటట్టు చూసుకుంటారు అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం.

 

భార్యా భర్తలిద్దరూ వృద్ధులు అయిపోయినప్పుడు భర్తను చూసుకోవడానికి భర్త అవసరాలను తీర్చడానికి భార్య ఓపికగా ఉండాలి. అందుకనే భార్య వయసు చిన్నగా ఉండాలి. అలానే ఎక్కువగా భార్య, భర్తల మధ్య గొడవలు రావడానికి కారణం ఇగో. వాళ్ళు చెప్తే నేను వినడం ఏంటి అనే అహం ఉంటుంది. అయితే ఇద్దరికీ వయసు తేడా ఉంటే ఆలోచనలలో తేడా వస్తుంది.

అదే విధంగా మరొక కారణం ఏమిటంటే హార్మోన్ ఇన్ బ్యాలెన్స్. అయితే మరీ ఎక్కువ తేడా ఉన్నా కూడా ఇబ్బంది. 2 నుండి 7 ఏళ్ల కంటే ఎక్కువ తేడా ఉంటే కూడా సమస్యలు వస్తాయి. పైగా మహిళలు కొంచెం బాగా ఆలోచిస్తారు అందుకని ఆలోచనా విధానంని దృష్టిలో పెట్టుకుని వయస్సు భేదం చూస్తారు. అలానే మహిళల్లో మానసిక బలం ఎక్కువగా ఉంటుంది. భర్త చనిపోతే భార్య తట్టుకోగలరు కానీ భార్య చనిపోతే భర్త తట్టుకోలేడు. ఇలా వీటన్నిటినీ చూసి వయసు భేదం పెట్టడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news