పసుపు, కుంకుమ కింద పడితే… దరిద్రం వస్తుందా..?

-

పసుపు కుంకుమ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు వాటికి ఎంతో ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. భారతీయులందరూ కూడా కుంకుమ పసుపుని పూజల్లో వాడుతూ ఉంటారు శుభకార్యాల్లో కూడా వాడుతూ ఉంటారు. పసుపు కుంకుమ లేనిది శుభకార్యమే జరగదు. పసుపు కుంకుమను దైవంగా భావిస్తారు. పసుపు కుంకుమ కింద పడకూడదు అని కూడా అంటూ ఉంటారు. కింద పడితే దరిద్రం వస్తుందని ఇబ్బందులు కలుగుతాయని అపశకునం జరుగుతుందని ఆందోళన చెందుతూ ఉంటారు.

అయితే మరి పసుపు కుంకుమ చేజారి పోతే కచ్చితంగా ఇబ్బందులు వస్తాయా దరిద్రం వస్తుందా అశుభమా అనే సందేహం చాలా మందిలో ఉంది మీకు కూడా ఈ సందేహం ఉన్నట్లయితే వెంటనే ఆ సందేహం నుండి బయటకు వచ్చేయండి. పండితులు ఈరోజు మనకి ఈ విషయం గురించి చెప్పారు. అయితే నిజానికి చాలామంది పసుపు కుంకుమ చేజారిపోతే కంగారు పడుతూ ఉంటారు.

ఇబ్బందులు కలుగుతాయని మంచిది కాదని భావిస్తూ ఉంటారు. అయితే నిజానికి పసుపు కుంకుమ కింద పడితే భూదేవికి బొట్టు పెట్టడానికి సంకేతం అని అన్నారు పండితులు. అలా కింద పడిపోయిన పసుపు కుంకుమను చెట్లకు వేయాలి. ఉంగరం వేలి తో బొట్టు పెట్టుకుంటే శాంతి కలుగుతుంది మధ్య వేలుతో కనక బొట్టు పెట్టుకుంటే ఆయుష్షు పెరుగుతుంది అని పండితులు అంటున్నారు. అయితే ఈసారి తనక కుంకుమ కాని పసుపు కానీ చేజారిపోతే కంగారు పడకండి ఏ ఇబ్బంది రాదు.

Read more RELATED
Recommended to you

Latest news