వేసవిలో మీ బాడీ చల్లగా మారాలంటే.. వీటికి దూరంగా ఉండాల్సిందే..!

-

summer: వేసవికాలంలో వేడిని తట్టుకోవడం అంత ఈజీ కాదు. వేసవి కాలంలో మన బాడీని చల్లగా మార్చుకోవడం చాలా అవసరం. వేసవికాలంలో హీట్ ని తట్టుకోవాలంటే కచ్చితంగా డైట్ లో మార్పులు చేసుకోవాలి. నీళ్లు, పండ్ల రసాలు, పండ్లు వంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి దానితో పాటుగా వేసవికాలంలో ఎండలో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం వంటివి చేస్తూ ఉండాలి.

summer
summer

వేసవికాలంలో బాడీ చల్లగా ఉండాలంటే వీటిని అస్సలు తీసుకోకూడదు. వీటిని సమ్మర్ లో తీసుకుంటే ఇబ్బందులు పడాలి వేసవికాలంలో చాలామంది వేడిని తట్టుకోలేక ఐస్ క్రీమ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అయితే ఐస్ క్రీమ్స్ ఎక్కువ తీసుకోవడం వలన ఒంట్లో వేడి పెరిగిపోతుంది జీర్ణ సమస్యల్లో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఐస్ క్రీమ్ ఎక్కువ తీసుకోకండి. అలానే వేసవికాలంలో పచ్చళ్ళని కూడా తీసుకోవద్దు ఎందుకంటే ఎక్కువ సాల్ట్ ఉంటుంది ఇది డిహైడ్రేషన్ ని కలిగించవచ్చు. కాబట్టి పచ్చళ్ళని కూడా వేసవిలో ఎక్కువ తీసుకోకండి.

డార్క్ చాక్లెట్ ని కూడా వేసవి కాలంలో తీసుకోకూడదు ఇందులో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది దాంతో డయేరియా డిహైడ్రేషన్ వస్తుంది. వేయించిన ఆహార పదార్థాలను కూడా తీసుకోవద్దు డీప్ ఫ్రై చేసిన సమోసా పకోడీలు వంటివి వేసవిలో తీసుకోవడం వలన యాక్ని పెరిగిపోతుంది సమస్యలు వస్తాయి. కాబట్టి వాటిని అసలు తీసుకోవద్దు.

రెడ్ మీట్ కి కూడా వేసవికాలంలో దూరంగా ఉండాలి మాంసం తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు వస్తాయి వికారం వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వేసవికాలంలో బాగా కారంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయి కాబట్టి ఎక్కువ స్పైసీ ఉండే ఆహారపు దర్గాలని తీసుకోవద్దు. కాఫీ ని కూడా వేసవికాలంలో ఎక్కువ తాగద్దు. కాఫీ ని తీసుకోవడం వలన ఒంట్లో వేడి పెరుగుతుంది వికారంగా ఉంటుంది కాబట్టి సమ్మర్ లో అసలు ఈ తప్పులను చేయకండి.

Read more RELATED
Recommended to you

Latest news