కొండగట్టు ఆలయ విశిష్టత.. అసలు ఆరోజు ఏం జరిగిందంటే..!

-

కొండగట్టు అంజన్న ఆలయం.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండిగ్‌ అవుతోంది. తెలంగాణ వాళ్లకు ఈ ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ పవన్‌ కళ్యాణ్‌ ఈ ఆలయానికి వెళ్తున్నాడు అని తెలిసినప్పటి నుంచి అందరికీ ఆ ఆలయం గురించి తెలుసుకోవాలి అనే ఇంట్రస్ట్‌ పెరిగింది. అందుకే ఈ అంజన్నక్షేత్రం గురించి, ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం..! మహిమళతో కూడుకున్న ఆలయం ఇది. సాక్షాత్తూ ఆ ఆంజనేయ స్వామి కొలువుదీరిన కొండ..!

కొండలు, లోయలు, సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు ప్రకృతి సౌందర్యంతో భక్తులను పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. కొండగట్టు మీద ఉన్న ఆంజనేయుని ఆలయం నిర్మాణం 400 ఏళ్లకు క్రితం జరిగిందని దేవాలయ చరిత్ర చెబుతోంది. ఇక్కడ ఆంజనేయుడు స్వయంభుగా వెలిశాడని.. 400 ఏళ్ల క్రితం కొడిమ్యాల పరిగణాల్లో సింగం సంజీవుడు అనే యాదవుడికి అంజనేయ స్వామి కనిపించినట్లు కథనం.. సంజీవుడు ఆవులు మేపుతూ, ఈ కొండ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఒక ఆవు మందలోని నుంచి తప్పిపోయింది.

ఆ అవును వెతుకుతూ అలసిన సంజీవుడు ఒక చింత చెట్టుకింద సేదదీరుతూ నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు హనుమంతుడు కలలో కనబడి.. తాను కోరంద పొదలో ఉన్నానని. తనకు ఎండ, వాన, ముండ్ల నుండి రక్షణ కల్పించమని.. నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడట.

సంజీవుడు ఉలిక్కిపడి లేచి, ఆవును వెతకగా, ‘శ్రీ ఆంజనేయుడు’ కంటపడ్డాడు. తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు. ఓ వైపు నృసింహస్వామి మరో వైపున ఆంజనేయస్వామి ముఖాలు కలిగిన ఆ విగ్రహాన్ని గ్రామస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించడం శంఖు చక్రాలు హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు.

ఇక్కడే ఎందుకు..?

రామ రావణ యుద్ధము జరిగే సమయంలో లక్ష్మణుడు మూర్చనొందగా సంజీవనిని తెచ్చేందుకు హనుమ బయలుదేరుతాడు. ఈ స్టోరీ మనందరికీ తెలుసు కదా..! సంజీవని తెచ్చేందుకు వెళ్లిన ఆంజనేయుడు సంజీవనీ పర్వతాన్ని తీసుకొస్తుండుంగా… ముత్యంపేట అనే ఈ మార్గంలో కొంతభాగము విరిగిపడింది. ఆ భాగాన్నే కొండగట్టుగా పిలుస్తున్నారు. ఈ గుడిని 300 సంవత్సరాల క్రితం ఒక ఆవులకాపరి సంజీవుడు నిర్మించాడు. ప్రస్తుతం ఉన్న దేవాలయం 160 సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్‌ముఖ్‌ తిరిగి నిర్మించారు.

సంతానం లేని వారు దర్శిస్తే..

ఆంజనేయునికి 40 రోజుల పాటు పూజ చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. విశేష పండగల సమయంలో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. హైదరాబాద్‌కు 160 కి.మీ.ల దూరంలో ఉన్న కొండగట్టుకు వెళ్లడానికి హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ నుంచి.. జగిత్యాలకు వెళ్లే బస్సులు ప్రతి 30 నిమిషాలకో బస్సు, కరీంనగర్‌ నుంచి ప్రతి 30 నిమిషాలకో బస్సు సర్వీసులను టీఎస్‌ ఆర్టీసీ నిర్వహిస్తోంది. అలాగే ప్రైవేటు క్యాబ్‌లు, ఆటోల సౌకర్యం కూడా ఉంది.

జన‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇవాళ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి తెలంగాణలో అడుగుపెట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు జ‌న‌సైనికులు సిద్ధ‌మ‌య్యారు. పవన్‌ కళ్యాణ్‌ వారాహీ యాత్రను కూడా ఇదే కొండగట్టుకు వచ్చి వాహనానికి పూజ చేసి మొదలుపెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version