గుడికి వెళ్ళేటప్పుడు.. ఈ తప్పలని అస్సలు చేయకండి..!

-

ఆలయాలకి వెళ్లేటప్పుడు ఈ తప్పులు చేయకూడదు. గుడికి వెళ్ళేటప్పుడు చాలామంది కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అలా చేయడం వలన చెడు జరుగుతుంది గుడికి వెళ్లేటప్పుడు స్నానం చేసేసి మంచి బట్టల్ని కట్టుకుని వెళ్లాలి మాసిపోయిన బట్టలు చిరిగిపోయిన బట్టలు కట్టుకుని గుడికి వెళ్ళకూడదు. ఏదైనా ఆహారం తిన్న తర్వాత గుడికి వెళ్ళకూడదు ఏమీ తినకుండా వెళ్లాలి. ఇంట్లో కాని దేవాలయంలో కాని అగరవత్తులు వెలిగించేటప్పుడు ఊదకూడదు. కేవలం చేతితో మాత్రమే మంటని ఆర్పాలి తప్ప నోటితో ఊదకూడదు.

ఎప్పుడైనా సరే పూజ చేసేటప్పుడు మొట్టమొదట వినాయకుడిని పూజించి ఆ తర్వాత మిగిలిన దేవుళ్ళని పూజించాలి. వినాయకుడిని పూజించేటప్పుడు తులసి ఆకులను పెట్టి పూజించకూడదు. పూజ చేసేటప్పుడు దీపాన్ని వెలిగిస్తాం కదా ఆ దీపాన్ని వెలిగించేటప్పుడు అగ్గిపెట్టితో వెలిగిస్తాము ఒక దీపం వెలిగిన తర్వాత ఇంకో దీపాన్ని కూడా ఆగి పెట్టుతోనే వెలిగించాలి తప్ప ఆ దీపాన్ని పట్టుకొని ఇంకొక దీపాన్ని వెలిగించకూడదు. అలా చేస్తే సమస్యలు వస్తాయి.

అనారోగ్య సమస్యలు పేదరికం వంటివి సంభవిస్తాయని పండితులు అంటున్నారు. గుడికి వెళ్ళినప్పుడు తీర్థం తీసుకుని ఆ చేతిని శిరస్సుకి రాసుకుంటూ ఉంటారు చాలామంది. అలా కూడా చేయకూడదు. గుడికి వెళ్ళేటప్పుడు చెప్పులు బయటపెట్టి ఒకసారి కాళ్లు కడుక్కుని ఆ తర్వాత వెళ్ళాలి. దేవాలయానికి వెళ్ళాక ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఆలయ వెనుక భాగాన్ని చేతితో తాకకూడదు ప్రదక్షిణాలు చేసేటప్పుడు గుడికి దూరంగా ప్రదక్షిణాలు చేయాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version