బాత్రూమ్‌లో ఇవి ఉంచితే అష్ట దరిద్రమట..! మీరు కామన్‌గా ఇవే చేస్తున్నారు..!

-

ఇంట్లో వాస్తు అనేది చాలా ముఖ్యం.. ఇంట్లోనే కాదు.. ప్రతి రూమ్‌లోనూ వాస్తు పక్కాగా ఉండాలి. ఏ వస్తువులు ఉంచాలి, ఏ వస్తువులు ఉంచకూడదో తెలిసి ఉండాలి. ఆఖరికి బాత్రూమ్‌లో కూడా కొన్ని పద్ధతులు పాటించాలి. వాస్తు ఊర్ఝా చక్రం ఆధారంగా పనిచేస్తుంది. ఈ శక్తి చక్రం మానవ జీవితం మీద సానుకూల లేదా ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది. చాలా సార్లు వాస్తు సరిగాలేని కారణంగా రకరకాల ఇబ్బందులో పడుతుంటారు. బాత్రూమ్‌ల విషయంలో మాత్రం కాస్త అశ్రద్ధ చేస్తుంటాం. బాత్రూమ్‌లో ఉంచే కొన్ని వస్తువులు వాస్తు దోషానికి కారణం కావచ్చు. అవి జీవితం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపించవచ్చు. బాత్రూమ్‌కు సంబంధించిన కొన్ని వాస్తు నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం.

బాత్రూమ్ ఇంట్లో ఉత్తరం లేదా వాయవ్య దిక్కున ఉండాలి. ఎప్పుడూ దక్షిణ ఆగ్నేయ, నైరుతి దిక్కున నిర్మించకూడదు.

వాటర్ బకెట్ బాత్రూమ్ లో ఎప్పుడూ నింపి ఉంచాలి. ఖాళీగా ఉంచాలని అనుకుంటే దాన్ని బోర్లించి పెట్టుకోవాలి.

బాత్రూమ్ డోర్ ముందు అద్దం ఉండకూడదు. ఇది ప్రతికూల శక్తులను ఆకర్శిస్తుంది.

బాత్రూమ్ తలుపు ఎప్పుడూ మూసి ఉంచాలి. తెరిచి ఉంచితే ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. కేరీర్ లో అడ్డంకులు రావచ్చు.

బాత్రూమ్ లో ట్యాప్ లు ఎప్పుడూ లీక్ కాకూడదు. ఇది ఇంట్లో ఆర్థిక నష్టానికి కారణం కావచ్చు. వీలైనంత వరకు బాత్రూమ్ పొడిగా ఉండేలా చూసుకోవాలి.

బాత్రూమ్ లో స్విచ్ బోర్డులు, గీజర్, ఫ్యాన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు బాత్రూమ్ లో ఆగ్నేయంలో అమర్చుకోవాలి.

బాత్ రూమ్ కు మంచి వెంటిలేషన్ ఉండాలి. అప్పుడే నెగెటివ్ ఎనర్జీ బయటికి వెళ్లడం సులభం అవుతుంది. వెంటీలెటర్ తూర్పు, ఉత్తరం లేదా పడమర దిక్కుగా ఉండాలి.

బాత్రూమ్ కు చెక్క తలుపు అమర్చుకోవాలి. మెటల్ డోర్ వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది. ఇది అనారోగ్యాలకు కారణం కావచ్చు.

బాత్రూమ్ గోడ పూజగది లేదా వంటగదికి ఉమ్మడిగా ఉండకూడదు. అంతేకాదు టాయిలేట్ గోడ వైపు మంచం కూడా ఉండకూడదు. పీడకలలు రావచ్చు.

బాత్ రూమ్‌లో ఎప్పుడూ లేత రంగులనే వాడాలి. టైల్స్ కానీ గోడల రంగులు కానీ లేత రంగులు ఎంచుకోవడం మంచిది.

పాతచెప్పులు

చాలామంది పాత చెప్పులను బాత్రూమ్‌లో ఉంచుతారు. పాడైపోయిన పాత చెప్పులు బాత్రూమ్‌లో ఉంచకూడదు. జ్యోతిషం ప్రకారం.. చివికి పోయిన పాత చెప్పులు శనిదోషాన్ని కలిగిస్తాయి. ఫలితంగా రకరకాల కష్టాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇది లక్ష్మీ దేవికి కూడా కోపం తెప్పించవచ్చు. విరిగిన, పగిలిన సోప్ కేసుల వంటివి వినియోగించకూడదు. మగ్గులు, బకెట్లు విరిగి పోయినపుడు వెంటనే మార్చి కొత్తవి అమర్చుకోవాలి. ఇవి నెగెటివ్ ఎనర్జిని ఆకర్శిస్తాయి.

రాలిపోయిన జుట్టు

ఇక తలస్నానం చేసినపుడు జుట్టు రాలిపోతుంటుంది. ఇది సాధారణంగా నీళ్లు వెళ్లిపోయే మార్గం దగ్గరి జాలి దగ్గర ఆగుతుంది. దాన్ని అలాగే వదిలేస్తుంటారు. ఇది వాస్తు దోషానికి కారణం అవుతుంది. అభివృద్ధి నిరోధకంగా మారుతుంది. బాత్రూమ్‌లో రాలిన జుట్టును ఎప్పటికప్పుడు శుభ్రం చెయ్యడం అవసరం. తడిబట్టలు కూడా చాలా మంది బాత్రూమ్‌లో వదిలేస్తుంటారు. ఇది అసలు మంచిది కాదు. కాబట్టి ఎప్పటికప్పుడు బాత్రూమ్ నుంచి వీటిని తొలగించాలి.

Read more RELATED
Recommended to you

Latest news