ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఒక్కసారి ఇలా చేస్తే సరిపోతుంది.. డబ్బే డబ్బు..

ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి డబ్బు మీద యావ ఉంటుంది.. డబ్బులను సంపాదించాలి ఫ్యామిలిని మంచిగా చూసుకోవాలని అనుకుంటారు.. దానికోసం రాత్రి పగలు కష్టపడతారు.. కానీ డబ్బులు చేతిలో నిలవవు.. అయితే కష్టపడి డబ్బులు సంపాదించినప్పటికీ ఆ డబ్బు చేతిలో మిగలడం లేదని పైగా ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయని చాలామంది మదన పడుతూ ఉంటారు. ప్రస్తుత రోజుల్లో ప్రతి 10 మందిలో 8 మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు.

 

సంపాదించిన డబ్బులు చేతిలో మిగలకపోగా అదనంగా ఖర్చుల కోసం అప్పు చేయాల్సి వస్తుంది అని బాధపడుతూ ఉంటారు. అయితే ఆర్థిక పరిస్థితులు ఎదురుకోవడానికి ఒక రకంగా వాస్తు దోషాలు కూడా కారణం అవ్వచ్చు.. అయితే వాస్తు దోషాలు ఇల్లు, కార్యాలయాలకు మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా వాస్తు దోషాలు ఉంటాయి. వాస్తు నియమాలు పాటించకపోతే మనిషిపై మానసికంగా మాత్రమే కాకుండా శారీరకంగా ప్రభావం పడుతుంది. అందుకే వాస్తు నియమాలను తప్పకుండా పాటించాలి.. అప్పుడే డబ్బులు ఉంటాయాన్ని నిపుణులు అంటున్నారు..

ఇంట్లో పనికిరాని వస్తువులను ఉపయోగించని వస్తువులను అమావాస్య రోజు బయటకు పారేయడం అమ్మడం లాంటివి చేయడం మంచిది. పడుకునేటప్పుడు దర్వాజా వైపు కాళ్ళు పెట్టి పడుకోకూడదు. అలాగే ఇంట్లో ఉండే సాలెగూళ్ళను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండండి. బూజు ఎక్కడ ఉండకుండా ఇంటిని శుభ్రంగా అందంగా ఉంచుకోవాలి. అలాగే క్రమం తప్పకుండ తులసి చెట్టుకు నీళ్లు పోస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే ఆ ఇంట్లోకీ లక్ష్మీ దేవి ప్రవేశిస్తుంది.. అలాగే తులసి కోట దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించడం మంచిది..