వాస్తు: లక్ష్మీ దేవి అనుగ్రహం కలగాలంటే… ఇలా చేయండి..!

-

ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం వాస్తు తో లభిస్తుంది. పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని ఈ రోజు చెప్పారు వీటిని కనుక అనుసరిస్తే సమస్యలు ఏమి లేకుండా ఉండొచ్చు. పైగా వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఇలా చేయడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అంతా మంచే జరుగుతుంది. వాస్తు ప్రకారం చూస్తే గులాబీ మొక్కకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గులాబీ మొక్క ప్రేమని తెలిపేలా ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే గులాబీ మొక్కని ఇంట్లో నాటితే పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. సమస్యలన్నీ తొలగిపోతాయి.

గులాబీ పువ్వులు చాలా అందంగా ఉంటాయి చక్కటి పాజిటివ్ ఎనర్జీ ని ఇస్తాయి. నెగటివ్ ఎనెర్జీని తొలగిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గులాబీ మొక్కని నైరుతి దిశలో నాటితే ఎంతో మేలు కలుగుతుంది చక్కటి ఫలితాన్ని పొందొచ్చు. ఎర్ర రంగు గులాబీ మొక్కని నాటితే మరీ మంచిది లక్ష్మీదేవికి ఎరుపు రంగు పూలు అంటే ఇష్టం, ఏదైనా సమస్యలు వాస్తు దోషాలు వంటివి తరచూ మీ ఇంట్లో కలుగుతున్నట్లయితే ఈ విధంగా ఆచరించండి. అలానే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఎరుపు రంగు పూలని పెట్టండి దాంతో సమస్యల నుండి గట్టెక్కొచ్చు.

భార్యాభర్తల మధ్య సమస్యలు కలుగుతున్నట్లయితే గులాబీ రేకులని బెడ్రూంలో ఒక గ్లాస్ లో నీళ్లు పోసి వేయండి. రోజు మీరు కావాలంటే రేకులని మారుస్తూ ఉండొచ్చు. ఇలా చేయడం వలన ప్రేమానురాగాలు పెరుగుతాయి ఆర్థిక ఇబ్బందులతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవికి రోజు సాయంత్రం కర్పూరంతో హారతి చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. ఇలా ఈ విధంగా మీరు ఆచరించారంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సమస్యలు నుండి బయటపడొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version