వాస్తు : దిండు కింద కత్తి పెట్టుకుంటే పీడకలలు రావట..!

-

మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి అనేక ఆయుర్వేద మరియు అల్లోపతి పద్ధతులు, వ్యాయామాలు, యోగాసనాలు మొదలైనవి ఉన్నాయి. కానీ ఆరోగ్యం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని కొత్త మార్గాలు వెతికినా సమస్య పూర్తిగా నయం అవడం లేదు. కొన్నిసార్లు మీ సమస్యలకు వాస్తు సమస్య కూడా కారణం కావొచ్చు. మానసికంగా మరియు శారీరకంగా దృఢంగా ఉండటానికి వాస్తు యొక్క ఈ ప్రత్యేక మార్గాలను పాటిస్తే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్ని వస్తువులను దిండు కింద ఉంచడం వల్ల మనం బాగా నిద్రపోతాము, మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది. ఏ వస్తువులు పెట్టుకోవాలో తెలుసుకుందాం.!

ఫ్లవర్స్

వాస్తు శాస్త్రం ప్రకారం నిద్రకు ఉపక్రమించే ముందు దిండు కింద సువాసనగల పూలను పెట్టుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి ఒత్తిడి తగ్గుతుంది. దీంతో వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

నాణేలు

పడుకునేటప్పుడు దిండు కింద తూర్పు దిశలో నాణేన్ని ఉంచుకుంటే మంచి ఆరోగ్యం ఉంటుంది.

కత్తి

ఒత్తిడి వల్ల నిద్రలో భయంకరమైన కలలు రావడం సహజం . ఈ సందర్భంలో, కత్తిని దిండు కింద ఉంచి నిద్రించండి. ఇది పీడకలలను తగ్గిస్తుంది. అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. పదును లేని కత్తిని పెట్టుకోవడం బెటర్‌.. లేదంటే పీడకలలేమో కానీ పీక తెగే ప్రమాదం ఉంటుంది.

వెల్లుల్లి

దిండు కింద వెల్లుల్లితో పడుకోవడం వల్ల పాజిటివ్ మూడ్ మరియు గాఢ నిద్ర వస్తుంది.

పచ్చి ఏలకులు

పచ్చి ఏలకులు లేదా పచ్చి మిరపకాయలను దిండు కింద ఉంచడం వల్ల మంచి నిద్ర వస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.

మెంతి

మెంతి గింజలను దిండు కింద ఉంచడం వల్ల రాహు దోషం తొలగిపోయి మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

భగవద్గీత

భగవద్గీత ఒక పవిత్ర గ్రంథం. దిండు కింద ఉంచడం వల్ల సానుకూలత వస్తుంది. ప్రతికూలతను దూరం చేస్తుంది. ప్రతికూలతను తొలగించడం వల్ల మంచి నిద్ర వస్తుంది.

రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీరు

మంచం పక్కన నేలపై ఒక గ్లాసు నీరు ఉంచడం శుభపరిణామంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం చెక్కుచెదరకుండా ఉంటుందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version