వాస్తు: కారులో ఈ మార్పులు చేస్తే అంతా మంచే కలుగుతుంది…!

-

వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల ఎలాంటి సమస్యలైన దూరం అయిపోతాయి. అయితే ఈ రోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. వీటిని కనుక అనుసరిస్తే నెగటివ్ ఎనర్జీ దూరం అయిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కారు విషయంలో ప్రతి ఒక్కరు ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది. దీనితో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే అదృష్టం కూడా ఉంటుంది. అయితే కారులో ఈ విధంగా ఫాలో అయితే సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్పారు. అయితే మరి కారులో ఎలాంటి చిట్కాలు పాటించాలి అనేది ఇప్పుడు చూద్దాం.

 

ఈ రోజుల్లో సాధారణంగా చాలామంది దగ్గర కారు ఉంటుంది అయితే కారులో ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉండాలంటే ఏదైనా దేవుడి విగ్రహాన్ని పెట్టడం మంచిది. వినాయకుడి విగ్రహం కానీ లేదు అంటే మీకు నచ్చిన దేవుడు విగ్రహం కానీ కారు లో పెట్టండి. గాలిలో కదులుతున్న హనుమంతుడు బొమ్మ పెట్టడం వల్ల కూడా మంచిదే. వీటివల్ల నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. అలానే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

అదే విధంగా కార్ లో నల్ల తాబేలు ని పెట్టడం కూడా మంచిది. ఇది కూడా నెగటివ్ ఎనర్జీ తొలగిస్తుంది.

చైనీస్ కాయిన్స్ ని కూడా కార్ లో పెట్టుకోవచ్చు. వీటివల్ల మంచి కలుగుతుంది. అలాగే చెడు మొత్తం తొలగిపోతుంది.

ఎసెన్షియల్ ఆయిల్ ని కార్ లో పెట్టడం వల్ల రిలాక్స్ గా ఉండొచ్చు. అలానే మంచి వైబ్రేషన్స్ వస్తాయి.

రాక్ సాల్ట్ ని బేకింగ్ సోడా కలిపి కార్ లో పెడితే కార్ లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది అలానే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

కాబట్టి ఈ పద్ధతిని కూడా రెగ్యులర్ గా అనుసరిస్తూ ఉండండి. ఇలా వీటిని కనుక మీరు అనుసరిస్తే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కార్లో ఉంటుంది ఏ సమస్య కలగదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version