Vasthu Tips : పడక గదిలో ఈ వస్తువులుంటే వాస్తు దోషం ఖాయం.. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు..

-

పడక గది వాస్తు చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎక్కువసేపు మనం గడిపేది ఇందులోనే కాబట్టి. పడక గదిలోనే మనం విశ్రాంతి తీసుకుంటాము. వివాహం తరువాత భాగస్వామితో ఆనంద క్షణాలు గడిపేది కూడా మనం ఈ రూములోనే.అందుకే పడక గది వాస్తుపరంగా సరిగ్గా ఉండాలి. లేదంటే మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. బెడ్ రూమ్ వాస్తు మాత్రమే కాదు అందులో ఉండే మంచం విషయంలో కూడా సరైన నియమాలు పాటించాలని చెబుతున్నారు వాస్తు పండితులు.

మనం పడుకునే మంచం చుట్టూ కొన్ని వస్తువులను పెట్టడం వల్ల ఇంట్లో వాస్తు దోషం పెరుగుతుంది. దాని వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. అందుకే నిద్రపోయే ముందు ఈ వస్తువులను మంచం దగ్గర ఉంచకూడదు. దీని వల్ల ఖచ్చితంగా ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. జీవితంలో ఎన్నో అశుభ ఫలితాలు ఎదురవుతుంటాయి. పడుకునే ముందు మంచం దగ్గర ఎలాంటి వస్తువులు ఉంచకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పగిలిపోయిన వస్తువులను ఎప్పుడూ కూడా పడకగదిలో అస్సలు ఉంచకూడదు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇలా ఉంచితే మీ కోరికలు,కలలు అసలు నెరవేరవు. ఇంకా అంతేకాదు ఈ వస్తువులు మీకు చాలా అసౌకర్యంగా అనిపిస్తాయి. అవి నిద్రకు భంగం కలిగిస్తాయి. అవి గది వాతావరణాన్ని పాడుచేస్తాయి. అందుకే అలాంటి వస్తువులు ఏవైనా ఉంటే వెంటనే గదిలో నుంచి తీసేయండి.

అలాగే మంచానికి దగ్గరగా సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, టాబ్లెట్, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పెడుతుంటారు. అయితే ఇలాంటివి అసలు పడకగది దూరం ఉంచాలని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఎందుకంటే ఈ గాడ్జెట్ల ద్వారా విడుదలయ్యే విద్యుదయస్కాంత క్షేత్రాలు మీ శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతాయట. వీటి ప్రతికూల శక్తులు మీ నిద్రకు అంతరాయం కలిగిస్తాయి. వీటి వల్ల మీకు నిద్ర కరువై.. రాత్రంతా మెల్కొవల్సి వస్తుంది.

కొందరు పడకగదిలో మొక్కలు పెడుతుంటారు. కొన్ని ఇండోర్ మొక్కలని పడకగదిలో పెట్టకూడదట. ఈ మొక్కలు స్వచ్చమైన గాలి, ప్రశాంతంగా అనిపించినప్పటికీ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మాత్రం కాక్టి వంటి స్పైకీ లేదా ప్రిక్లీ మొక్కలు శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి. అయితే మీ బెడ్ రూమ్ లో ప్రశాంతత, సంతోషంగా ఉండే వాతావరణం కోసం గుండ్రని, మృదువైన ఆకులు ఉన్న మొక్కలను అయితే పెట్టవచ్చు.చాలా మంది కూడా పడక గదిలో వస్తువులను చిందరవందరగా ఉంచుతుంటారు. కానీ అసలు ఇలా ఉంచకూడదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి. అంతేకాదు విశ్రాంతి లేకపోవడం, నిద్రకు భంగం కలిగించే అవకాశం కూడా ఉంటుంది. ప్రశాంతంగా నిద్రించాలంటే పడకగదిని ఖచ్చితంగా శుభ్రంగా ఉంచుకోవాలి.

అలాగే అక్వేరియంలు, ఫౌంటైన్లు వంటి నీటి మూలకాలు ఉన్న చోట ప్రశాంతంగా ఉంటుంది. అయితే వాస్తు ప్రకారం ఇలాంటివి మీ పడకగదిలో అస్సలు ఉంచకూడదు. ఎందుకంటే ఇలాంటి పెట్టడం వల్ల ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఇవి ఖచ్చితంగా నిద్రకు భంగం కలిగించే అవకాశం ఉంటుంది.ఇక జ్యోతిష్యం ప్రకారం, అద్దాలు ప్రతికూల శక్తిని కలిగి ఉన్నాయని భావిస్తుంటారు. ఇది పీడకలలు ఇంకా నిద్రకు భంగం కలిగిస్తుంది. అయితే మీకు అద్దం అవసరం ఉంటే శక్తి ప్రవాహానికి అంతరాయం కలగకుండా ఉండటానికి దాన్ని రాత్రిపూట తీసి పక్కన పెట్టండి. లేదంటే ఆ అద్దాన్ని మంచానికి ఎదురుగా ఉంచకండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version