మాంసాహారం తింటే పాపం తగులుతుందా..? శాస్త్రాలు, వేదాలులో ఏముంది..?

-

శాస్త్రాలు శాఖాహారం తీసుకోవాలని చెప్తున్నాయి. పవిత్ర గ్రంథం అయిన భగవద్గీత కూడా శాకాహారాన్ని తీసుకోవాలని.. అహింసని అనుసరించమని చెప్తుంది. జీవులని చంపడానికి వ్యతిరేకం. అయితే శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏ ప్రాణిని చంపొద్దు అని.. బాధ పెట్టకూడదని చెప్తారు. జంతువులని ప్రేమగా, గౌరవంగా చూడమని బోధించారు. వేదాలు కూడా మాంసాహారం తీసుకోకూడదని చెప్తున్నాయి. ప్రపంచంలోనే ప్రతి జీవికి ప్రత్యేక ఉద్దేశం ఉందని వేదాలలో ఉంది. అందుకే మానవులు ఓ జీవహింస చేయరాదని అంటారు ఆత్మ శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి శాఖాహారం తీసుకోవాలని.. జంతువుల్ని చంపి వాటి మాంసం తినేవాళ్ళకు దేవతలు నివసించే స్వర్గంలో స్థానం ఉండదని అంటారు.

జంతువుల మాంసాన్ని కొనడం కానీ విక్రయించడం కానీ జీవిని చంపడానికి కూడా మనమే బాధ్యులం అవుతాము. రాజసిక, తామసిక, సాత్విక ఇలా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మూడు రకాల ఆహారాలు ఉన్నాయి. రాజసిక అంటే పులుపు, కారం. తామసిక అంటే దుర్వాసన వస్తుంది జీర్ణ ప్రక్రియ దెబ్బతింటుంది. మాంసాహారం జాతకంలో గ్రహాల స్థానంపై ప్రభావం చూపిస్తాయి. సాత్విక ఆహారం తాజాగా ఉంటుంది సులభంగా జీర్ణం అవుతుంది.

మాంసాహారం తీసుకోవడం వలన జాతకంలో మార్పులు ఉంటాయి. అంగారకుడు వేడిగా ఉంటే చంద్రుడు బలహీనంగా ఉంటాడట ఇది వ్యక్తి జాతకం పై ప్రభావం చూపిస్తుంది. మద్యం, మాంసాహారం తీసుకునే వాళ్ళ కర్మ రుణాలు రెట్టింపు అవుతాయి. అదృష్టం ఉండదు. శాఖాహారం తీసుకుంటే పూర్వపు బాధలు తొలగిపోతాయి. అలాగే మనల్ని ప్రశాంతంగా ఉంచుతాయి. సానుకూల ఫలితాలని ఇస్తాయి. ఆత్మను పవిత్రం చేస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version