సింగరేణి సంస్థ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ, హైదరాబాద్ రీజియన్ శ్యామ్ మిశ్రా అధికారులతో కలిసి రామగుండం మేడిపల్లి ఒపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ను సందర్శించారు. ప్రాజెక్టులోని బెంచ్ నిర్మాణ పనులను, క్వారీ లోపలి పని స్థలాలను మ్యాపుల ద్వారా పరిశీలించారు. పని స్థలాల్లో తీసుకుంటున్న రక్షణ చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఒవర్ బర్డెన్ తరలింపు పనులను, బొగ్గు ఉత్పత్తి ప్రదేశాలను పరిశీలించారు.