ఉప్పల్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులపై బుధవారం ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మంత్రి కేటీఆర్‌ను వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలోని 36 కాలనీల రెగ్యులరైజేషన్, చెరువుల సుందరీకరణ, పనులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అదే విధంగా ఉప్పల్‌లోని చిల్డ్రన్స్ పార్కు, మల్లాపూర్ వైకుంఠధామం, డబుల్ బెడ్రూమ్ల ప్రారంభోత్సవానికి రావాలని మంత్రిని ఆహ్వానించారు.